ఎప్పుడూ సరికొత్త పద్దతిలో అలరించే జీ తెలుగు ఈసారి కూడా తనదైన రీతిలో అందరిని మంత్రముగ్ధులను చెయ్యడానికి వచ్చేసింది. గతవారమే 'నాగభైరవి' సీరియల్ ప్రోమోతో మన ముందుకు వచ్చిన జీ తెలుగు, ఇప్పుడు ఆ సీరియల్ టైటిల్ సాంగ్ ని రివీల్ చేసింది.

ఈ పాటను రామానాయుడు స్టూడియోస్ లో చిత్రీకరించగా, టాలీవుడ్ మహారాణి రమ్యకృష్ణ గోల్డెన్ కలర్ కాంజీవరం చీరలో మెరుస్తూ ఈ టైటిల్ సాంగ్ లో కనిపిస్తారు . ఆమెతో పాటు నాగభైరవి సీరియల్ తారాగణం పవన్ సాయి, యాష్మి గౌడ, కల్కి రాజా మరియు అశ్విని కనిపిస్తారు.

టైటిల్ సాంగ్ ను మన యువ గాయిని మంగ్లీ పాడగా, పాటల మాంత్రికుడు రామజోగయ్య శాస్త్రి రచించారు. తన మ్యూజిక్ తో యువ హృదయాల్ని కొల్లగొట్టే గోపి సుందర్ ఈ సిరియల్ టైటిల్ సాంగ్ ని కంపోజ్ చేసారు. అతిరథమహారధులందరూ కలిసి ఎంతో గొప్పగా తీర్చిదిన ఈ పాటను ఈ నెల 26 వ తేదీన జీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.