రమ్య కృష్ణ కెరీర్ చెప్పుకోదగ్గ సినిమాలు ఏవంటే బాహుబలితో పాటు నరసింహ సినిమా కూడా వెంటనే గుర్తొస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ సరికొత్త రికార్డులు బ్రేక్ చేసింది. లేడి విలన్ గా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చూపించిన హావభావాలు ట్రెండ్ సెట్ చేశాయి. ఓ విధంగా బాహుబలి కంటే ఎక్కువ రేంజ్ లో రమ్యకృష్ణకు గుర్తింపు దక్కింది.  

అయితే అంతగా పేరు తెచ్చి పెట్టిన పాత్ర అమ్మడికి ఏ మాత్రం ఇష్టం ఉండదట. మొదట దర్శకుడు కెఎస్. రవికుమార్ సౌందర్య పాత్ర కావాలా? అని అడిగితే వెంటనే ఎగిరి గంతేసి ఒప్పేసుకునేదాన్ని కానీ దర్శకుడు నీలాంబరి పాత్రకి నువ్ కరెక్ట్ గా సరిపోతావని ఒత్తిడి చేయడం తోఒప్పుకున్నా.అని చెప్పింది.  

షూటింగ్ జరిగేటప్పుడు నెగిటివ్ రోల్ లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా సౌందర్య మొహంపై కాలు ఉంచినప్పుడు ఎంతో బాధగా అనిపించింది. కానీ దర్శకుడి టేకింగ్ వల్ల సినిమా షూటింగ్ మొత్తం అయిష్టంతోనే పూర్తీ చేశా అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ తెలిపింది. అయితే సినిమా రిలీజ్ తరువాత నీలాంబరి పాత్ర అంతగా హిట్టవుతుంది అని అనుకోలేదని రమ్యకృష్ణ వివరణ ఇచ్చారు.