వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై ట్వీట్లు, కామెంట్లు చేస్తూనే ఉంటాడు. కొన్ని రోజులుగా వర్మ పుష్ప చిత్రంపై, అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై ట్వీట్లు, కామెంట్లు చేస్తూనే ఉంటాడు. కొన్ని రోజులుగా వర్మ పుష్ప చిత్రంపై, అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా వర్మ మరో అంశంపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశాడు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ పై వర్మ వరుస ట్వీట్లు చేశాడు. కేంద్ర బడ్జెట్ అనేది నాకు ఎప్పటికీ అర్థం కానీ అంశం. కనీసం బడ్జెట్ ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని కూడా నేను ఇంతవరకు కలవలేదు. ఎందుకంటే మనమంతా మన ఇంటి బడ్జెట్ రూపొందించుకోవడంలో బిజీగా ఉంటాం. ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు చారిత్రాత్మక బడ్జెట్ అని అంటారు. కాంగ్రెస్, సిపిఐ లాంటి ఇతరపార్టీలు బడ్జెట్ పై విమర్శలు చేస్తాయి. కానీ సామాన్యుడు మాత్రం బడ్జెట్ ముగిశాక ప్రశాంతంగా నిద్ర పోతాడు. మానవ జాతిగా మనం అడవి నుంచి బయటకు వచ్చి నాగరిక సమాజం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పటికి కొన్ని జంతువులు మనుషుల రూపంలో తిరుగుతూనే ఉన్నాయి.
భయంకరమైన హిట్లర్, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ లాంటి వల్లే ఈ ప్రపంచంలో నాటకీయ మార్పులు తీసుకువచ్చారు. కానీ మంచి వాళ్ళం, సామాన్యులం అయిన మనం పిల్లల్ని కంటూ, టాక్సులు కడుతూ బతికేస్తున్నాం అని వర్మ సెటైరికల్ గా స్పందించాడు.
ప్రస్తుతం వర్మ 'కొండా' అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తెలంగాణాలో వివాదంగా మారుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.
