చిన్న సినిమాగా విడుదల అయిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి కేరక్టర్ లో హీరోగా నటించిన తీరు, డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమాని తీసిన విధానం వల్ల ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో చూశాం.

 

ఇంత హిట్ అయినా అర్జున్ రెడ్డి దర్శకుడి తదుపరి చిత్రం గురించి ఏవో కొన్ని రూమర్లు తప్ప పక్కాగా ఎలాంటి స్టెప్ ముందుకుపడలేదు. అయితే సందీప్ వంగ తదుపరి సినిమా కథ తనకి తెలుసు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ.

 

సందీప్ చెప్పిన కథతో తీసే సినిమా ముందు అర్జున్ రెడ్డి ఓ సూపర్ ఫ్లాప్ సినిమా అయిపోతుందని, అంతటి మెగా విజయాన్ని ఆయన తదుపరి చిత్రం సొంతం చేసుకుంటుందని అన్నాడు. సందీప్ రెడ్డి రెండో సినిమా కూడా హిట్ కొట్టి తీరతాడు అన్నారు రామూ.

 

అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని రీసెంట్ గా కలిసానని రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ లో ఒక ఫోటో పెట్టి వివరించారు. సందీప్ తన తదుపరి సినిమా కథను తనకు వివరించాడని, అది విన్న తరువాత తాను అసూయతో రగిలిపోయానని అన్నాడు. మరి ఆ మూవీ అర్జున్ రెడ్డి మించి సంచలనం అవుతుందేమో చూడాలి.