రంగస్థలంతో గ్రాండ్ సక్సెస్ సాధించి.. నాన్ బాహుబలి రికార్డులన్నీతన  ఖాతాలో వేసేసుకుని.. ఇంకా వసూళ్లతో సత్తా చాటుతున్న రామ్ చరణ్.. సడెన్ గా హైద్రాబాద్ రోడ్లపై ఐస్ క్రీములు అమ్మేసుకుంటున్నాడు.

 మేము సైతం అంటూ మంచు లక్ష్మి.. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ టీవీ షో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు చెర్రీ అంగీకరించాడు. ఇప్పుడు రామ్ చరణ్ కు సంబంధించిన ఎపిసోడ్ కు షూటింగ్ చేశారు.హైద్రాబాద్ రోడ్లపై ఐస్ క్రీములు అమ్ముతూ డబ్బులు రాబడుతున్నాడు రామ్ చరణ్.  దీని కోసం హైద్రాబాద్ రోడ్లపై ఎండలను లెక్క చేయకుండా ఐస్ క్రీములు అమ్మేస్తున్నాడు చెర్రీ. మరి రామ్ చరణ్ కలెక్షన్ ఎంతొచ్చిందో తెలియాలంటే ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సందే.