రీసెంట్ గా జిమ్ లో గాయపడిన రామ్ చరణ్ రెస్ట్ మోడ్ లో ఉన్నారు.  తన బాబాయ్ జనసేన కోసం ప్రచారం సైతం చేసిన ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. అయితే ఇంట్లో  చెర్రీకు  ఏం తోస్తుంది..ఏం చేస్తున్నారు..అంటే తన భార్యతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ జీవితంలో ఆనందాలని అనుభవిస్తున్నారు. 

తన శ్రీమతి కోసం స్వయంగా ఓ  కాఫీ కలిపి ఇచ్చాడు రామ్ చరణ్.  రామ్ చరణ్ ని ముద్దుగా ‘మిస్టర్ సీ’ అని పిలిచే  ఉపాసన తన శ్రీవారు కలుపుతున్న  కాఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫ్యాన్స్ కు ఆనందం కలిగించారు. . ‘ఫైనల్ టచెస్ బై మిస్టర్ సీ హిమ్‌సెల్ఫ్... నమ్మండి  అదిరిపోయింది’ అంటూ కామెంట్ కూడా చేసారామె. ఉపాసన కొణిదెల ట్వీట్ చేసిన పోస్ట్ ఇదే...

ఇక రంగస్దలం చిత్రంతో నటుడుగా మరో మెట్టు ఎక్కిన రామ్ చరణ్ ప్రస్తుతం తన దృష్టి అంతా ఆర్ ఆర్ ఆర్ చిత్రంపైనే పెట్టారు. వినయ విధేయ రామ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రామ్  చరణ్ చాలా హర్ట్ అయ్యారు. ఎంతలా అంటే పబ్లిక్ గా సారీ చెప్పేంత . అయితే  ఆర్ ఆర్ ఆర్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా మరోవైపు కొత్త స్క్రిప్ట్ లు వింటూనే ఉన్నాడట చరణ్.  

రీసెంట్ గా  ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తర్వాతి సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చరణ్‌ స్క్రిప్టు విన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌, ప్రమోషన్ క్యాంపైన్ పూర్తయిన తర్వాత చరణ్‌ ఈ సినిమాను ప్రారంభించనున్నారట. చెర్రీ-వంశీ కాంబినేషన్‌లో 2014లో ‘ఎవడు’ సినిమా వచ్చి హిట్టైంది.