Asianet News TeluguAsianet News Telugu

Ramcharan :మలయాళ రీమేక్ పై తేల్చకుండా..నాన్చుతున్న మెగా పవర్ స్టార్..

మలయాళం నుంచి మెగా ప్యామిలీ సినిమాలు తీసుకుంటూనే ఉన్నారు. లూసిఫర్ టైమ్ లోనే మరో సినిమా హక్కులు రామ్ చరణ్ తీసుకున్నారు. ఈ సినిమా తాను చేస్తాడా.. నిర్మాతగా ఉంటాడా..? ఎటూ తేల్చకుండా నాన్చుతున్నాడు.

Ramcharan Driving Licence Remake Update
Author
Hyderabad, First Published Jan 13, 2022, 2:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మలయాళం నుంచి మెగా ప్యామిలీ సినిమాలు తీసుకుంటూనే ఉన్నారు. లూసిఫర్ టైమ్ లోనే మరో సినిమా హక్కులు రామ్ చరణ్ తీసుకున్నారు. ఈ సినిమా తాను చేస్తాడా.. నిర్మాతగా ఉంటాడా..? ఎటూ తేల్చకుండా నాన్చుతున్నాడు.

ఈమధ్య టాలీవుడ్ కు రీమక్ సినిమాల దండయాత్ర గట్టిగానే జరుగుతుంది. మన కథలు బాలీవుడ్ తీసకుంటుంటే..మనవాళ్లేమో మలయాళ సినిమాలను తీసుకుంటున్నారు. మలయాళ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఆహాలాంటి ఓటీటీల్లో మలయాళ సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు కూడా. ఇక మెగా ఫ్యామిలీ నుంచే మూడు సినిమాల కథా హక్కులను మలయాళం నుంచి తీసుకున్నారు. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. మలయాళ లూసీఫర్ మూవీని మెగాస్టార్ చేస్తున్నారు.

ఇక మలయాళం నుంచి మెగా హీరోలు తీసుకున్న మరో సినిమా డ్రైవింగ్ లైసెన్స్. మాలీవుడ్ లో నాలుగు కోట్లతో నిర్మించబడి.. దాదాపు 30 కోట్లు వసూలు చేసిన సినిమా డ్రైవింగ్ లైసెన్స్.  మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈసినిమాలో స్టార్ హీరో ప్రుధ్విరాజ్ సుకుమారన్ తో పాటు సూరజ్ లీడ్ రోల్స్ చేశారు. జిన్ పాల్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు హక్కులను రామ్ చరణ్ తీసుకున్నారు.

 

ఈ మూవీ హక్కుల కోసం తెలుగుతో పాటు వివిధ భాషల నుంచి పోటీ పడ్డారు. హిందీలో ఈమూవీ హక్కులు స్టార్ ప్రోడ్యూసర్ కరణ్ జోహార్ తీసుకున్నారు. అక్షయ్ కుమార్-హిమ్రాన్ హష్మికాంబినేషన్ లో.. రాజ్ మెహతా డైరెన్ లో ఈమూవీ త్వరలో సెట్టస్ పైకి వెళ్ళబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడ కంప్లీట్ అయ్యాయి.

 కాని ఇట తెలుగులోనే ఈ మూవీ హక్కులు తీసుకున్న రామ్ చరణ్ ఎటూ తేల్చడం లేదు. ఆమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాన్- రవితేజ్ కాంబినేషన్ లో ఈమవీ తెరకెక్కిస్తారు అన్న టాక్ గట్టిగా నడిచింది. లేదు రామ్ చరణ్ – రవితేజ కలిసి చేస్తారంటూ న్యూస్ బయటకు వచ్చింది. కాని మళ్లీ ఈమధ్య ఈ సినిమాపై నోరు మెదపడం లేదు. చరణ్ ఈ సిమాను నిర్మించడం ఖాయం.. కాని ఎవరితో చేస్తాడు అనేది ఇంత వరకూ తేలడం లేదు.

Also Read:Balakrishna Allu Arjun Multi Starar: బాలయ్యతో బన్నీ మల్టీ స్టారర్.. ?ఫ్యాన్స్ కు పండగే..!

కరోనా పుణ్యమా అని చరణ్ నిర్మించి తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య లేట్ అయిపోయింది. ఎన్టీఆర్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. దాంతో ఈ చికాకులు అన్నీ అయిపోయిన తరువాత తీరిగ్గా.. ఈ సినిమా సంగతి చూద్దాం అని రామ్ చరణ్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Also Read:నా సినిమాకే పోటీగా రిలీజ్ చేస్తావా.. స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

Follow Us:
Download App:
  • android
  • ios