రికార్డు కలెక్షన్స్ దిశగా రామ్ చరణ్ ధృవ 5 రోజుల్లో ఏపీ,తెలంగాణల్లో 28.71 కోట్ల షేర్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎంతో కాలంగా ఎదురు చూసిన లక్ష్యం నెరవేరింది. వరుస పరాజయాలతో హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ కు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై రిలీజైన ధృవ సినిమా హిట్ కలెక్షన్స్ సాధిస్తూ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. పోలీస్ ఆఫీసర్ రోల్ లో సరికొత్త శరీర దారుఢ్యంతో రామ్ చరణ్ అలరిస్తున్నారు.

రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ డిసెంబర్9 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఒకవైఫు కరెన్సీ రద్దు ప్రభావం సామాన్యులపై తీవ్రంగా పడుతున్నా... ధృవ చిత్రం మంచి కలెక్షన్లనే రాబట్టింది. అమెరికాలో చరణ్ కు మిలియన్ డాలర్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది ధృవ.

ఇక ఏపీ, తెలంగాణాల్లో మెగా అభిమానులు, సినీ అభిమానులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్ సిక్స్ ప్యాక్ లుక్, అద్భుతమైన పోలీస్ స్టోరీ లైన్, సురేందర్ రెడ్డి రిచ్ మేకింగ్, రామ్ చరణ్, అరవింద స్వామిల నటన, రకుల్ ప్రీత్ గ్లామర్ వంటివి ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచి... మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 5 రోజుల షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రాంతం

కలెక్షన్స్ (షేర్-రూపాయలు)

నైజాం

10.24 కోట్లు

సీడెడ్

4.92 కోట్లు

ఉత్తరాంధ్ర

3.74 కోట్లు

పశ్చిమ గోదావరి

1.99 కోట్లు

తూర్పు గోదావరి

2.28 కోట్లు

కృష్ణా

2.11 కోట్లు

గుంటూరు

2.49 కోట్లు

నెల్లూరు

94 లక్షలు

మొత్తం

28.71 కోట్లు