జెమినీ మామ మంచోడు.. తప్పంతా సావిత్రిదే!

ramaprabhas comments on savitri and gemini ganeshan
Highlights

దర్శకుడు నాగ్అశ్విన్ అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో 'మహానటి' చిత్రాన్ని రూపొందించిన 

దర్శకుడు నాగ్అశ్విన్ అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో 'మహానటి' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ సినిమాలో తన తండ్రిని తప్పుగా చూపించారంటూ జెమినీ గణేశన్ మొదటి భార్య కూతురు కమలా సెల్వరాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

తాజాగా సీనియర్ నటి రమాప్రభ.. జెమినీ గణేశన్ ను ఉద్దేశిస్తూ జెమినీ మామ చాలా మంచోడు అంటూ కితాబిచ్చింది.. ''జెమినీ గణేశన్ ను సినిమాలో తప్పుగా చూపించారు. నిజానికి తప్పంతా సావిత్రిదే.. జెమినీ మామ తప్పేం లేదు. చివరివరకు కూడా ఆయన సావిత్రికి దగ్గరవ్వాలనే చూశారు. నేను సావిత్రితో పదేళ్ల పాటు ఉన్నాను. జెమినీ గోడ దూకి పారిపోయిన సందర్భంలో కూడా నేను అక్కడే ఉన్నాను. కావాలనే ఆయన మీదకు కుక్కలను ఉసిగొల్పింది సావిత్రి. ఆమె జీవితం నాశనం అవ్వడానికి కారణం ఎవరో కాదు ఆమె మొండితనమే'' అని స్పష్టం చేసింది. 

loader