Asianet News TeluguAsianet News Telugu

ఇంకాస్త సమయం కావాలంటున్న ‘రామరావు ఆన్ డ్యూటీ’.. రిలీజ్ డేట్ వాయిదా వేసిన మేకర్స్.. రీజన్ ఏంటంటే?

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామరావు ఆన్ డ్యూటీ’. ఈ మూవీ వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది ఉంది. కానీ  ఇంకాస్త సమయం కావాలంటూ మేకర్స్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఇంతకీ రీజన్ ఏంటంటే..
 

Rama Rao on Duty Movie which needs more time, Release date postponed makers,  What is the reason?
Author
Hyderabad, First Published May 26, 2022, 6:48 PM IST

రవితేజ (Raviteja) హీరోగా, శరత్ మండవ దర్వకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘రామరావు ఆన్ డ్యూటీ’(Rama Rao on Duty). ఈ మూవీ రవితేజ పవర్ ఫుల్ సివిల్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. ఇటీవల ‘క్రాక్’తో భారీ విజయం అందుకున్న రవితేజ.. ఆ తర్వాత ‘ఖిలాడీ’తోనూ పర్లేదు అనిపించుకున్నాడు. ప్రస్తుతం ‘రామా రావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కు క్యూలో ఉంది. ఈ చిత్రం వచ్చే నెల 17న గ్రాండ్ గా విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. 

అయితే, తాజాగా మేకర్స్ అందించిన  అప్డేట్ మాస్ మహారాజా అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ చిత్ర రిలీజ్ ను మరికొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ లేటెస్ట్ గా అప్డేట్ చేశారు. దీంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం  చేస్తున్నారు. వచ్చే నెలలో తమ అభిమాన హీరో సినిమా సందడి ఉంటుందని భావించిన ఫ్యాన్స్ కు కొంచెం ఇబ్బంది కలిగించే నిర్ణయమే మేకర్స్ తీసుకున్నారని చెప్పాలి. అయితే ఈ డీలేకు కారణం ఏంటో కూడా చెప్పారు మేకర్స్... అభిమానులకు, ప్రేక్షకులకు బిగ్  స్క్రీన్ పై మరింత మాస్ అవుట్ పుట్, బెస్ట్ విజువల్స్ ను అందించేందుకే కాస్తా సమయం కావాలంటున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను అత్యంత శ్రద్ధతో పూర్తి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మంచి అవుట్ పుట్ తో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామన్నారు.  

ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాండ్ వస్తోంది. రవితేజ  ఈ సినిమాలో డిప్యూటీ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీతోనే వేణు తొట్టెంపూడి రీఎంట్రీ కూడా కుదిరింది. నాజర్, నరేష్, తనికెళ్ల భరణి, రాహుల్ రామక్రిష్ణ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్టీ టీం వర్క్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ‘రావణసుర, ధమాఖ, టైగర్ నాగేశ్వర్ రావు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios