యువ కథానాయకుడు రామ్ - స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా పూరి డిఫరెంట్ స్టైల్ లో సినిమాను ప్రజెంట్ చేయనున్నాడట. 

రామ్ ఎనర్జీకి తగ్గట్టు పూరి మంచి డైలాగ్స్ ను కూడా రాసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమాను రామ్ హోమ్ బ్యానర్ లో స్రవంతి రవికిశోర్ తో పాటు పూరి జగన్నాథ్ కూడా నిర్మించేందుకు సిద్ధమయినట్లు టాక్. అదే విధంగా ఛార్మి మరోసారి పూరి సినిమాకు ప్రొడక్షన్ మ్యానేజర్ గా ఉంటూనే సినిమా నిర్మాణంలో కొంత ఇన్వెస్ట్ మెంట్ చేస్తుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

రామ్ గత చిత్రాలు కూడా పెద్దగా హిట్ కాలేదు. హలో గురు ప్రేమ కోసమే హిట్టవుతున్నట్లే అనిపించినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక పూరి గత రికార్డుల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఇలాంటి కాంబినేషన్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న పని. కానీ ఛార్మి సేఫ్టీ జోన్ లో ఎమౌంట్ ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎలాగైనా హిట్టందుకోవాలని పూరి కసిమీద ఉన్నాడు. స్టార్ హీరోలతో చేయాలనుకున్న ప్రాజెక్టులు అన్ని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. పూరి ట్రాక్ గురించి బయపడి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. గతంలో కూడా ఈ దర్శకుడు ఇలాంటి అనుభవాలను రుచి చూశాడు. మరి రామ్ ద్వారా వచ్చిన అవకాశంతో ఏ రేంజ్ లో హిట్టందుకుంటాడో చూడాలి.