'దేవదాస్' సినిమాతో సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యారు రామ్ పోతినేని. తొలి సినిమాతోనే ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నాడు. అప్పటి నుండి వరుస సినిమాలతో దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రెడీ - మస్కా - కందిరీగ - పండగ చేస్కో సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ శంకర్' చిత్రంతో తన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇదే ఊపులో రామ్ తన తదుపరి సినిమాగా 'రెడ్'ను పట్టాలెక్కించాడు.

 ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. తమిళ మూవీ తడమ్‌ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీలో రామ్‌ తొలిసారిగా డ్యూయల్‌ రోల్‌ చేశాడు. విడుదలకు ముందే పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటివ్‌ క్రియేట్‌ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ‘రెడ్‌’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రామ్ ఈ చిత్రంలో కూడా మాస్ లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో రామ్ తన తదుపరి సినిమా ఏదీ ఫైనలైజ్ చేయలేదు. కథలు వింటున్నారు. దర్శకులతో మీటింగ్స్ జరుపుతున్నారు. 

అంతేకాదు చిన్న బ్రేక్ ఇస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో శివ మాల‌ను ధ‌రించారు రామ్. దానికి సంబంధించిన ఫొటోను కూడా ఈ హీరో సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా సాధార‌ణంగా శివుడి మాల‌ను మండ‌లంగా ధ‌రించేవారు 41 రోజుల పాటు నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తూ స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది.

 ఈ క్ర‌మంలో కొన్నింటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే రామ్ బ్రేక్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక  రామ్ తన తదుపరి చిత్రంలో తన పాత్రను పూర్తిగా చేంజ్ చేయాలని భవిస్తున్నాడట. రెడీ సినిమా లాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ముందుకు రావాలనుకుంటున్నాడు.