Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ లో ‘స్కంద’.. సెన్సార్ పూర్తి.. రేపే కల్డ్ జాతర.. రన్ టైమ్ డిటేయిల్స్

రామ్ పోతినేని ‘స్కంద’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రన్ టైమ్ డిటేయిల్స్ అందాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఉస్తాద్ ‘బిగ్ బాస్’ హౌజ్ లో రచ్చ  చేశారు. 
 

Ram Pothineni Skanda movie censor completed here is Runtime details NSK
Author
First Published Sep 24, 2023, 5:43 PM IST

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) లేటెస్ట్ ఫిల్మ్ ‘స్కంద’(Skanda).  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  హీరోయిన్ గా నటించింది. సాయి మంజ్రేకర్ మరో హీరోయిన్ గా కనిపించబోతోంది. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఎట్టకేళలకు యూనిట్ ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించింది. ‘స్కంద’పై హైప్ ను పెంచేస్తున్నారు. 

ఇప్పటికే సెప్టెంబర్ 15నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం 13 రోజుల వాయిదాతో సెప్టెంబర్ 28కి పోస్ట్ పోన్ అయ్యింది. అంటే మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రామ్ అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. U/A సర్టిఫికెట్ అందింది. అడల్డ్స్ తో పాటు పిల్లలు కూడా పేరేంట్స్ ఆధ్వర్యంలో చూడొచ్చని బోర్డు తెలిపింది. దీంతో సినిమా థియేటర్ లోకి అడుగుపెట్టడమే తరువాయి. ఇక సినిమా నిడివి 2 గంటల 47 నిమిషాలకు లాక్ అయ్యింది. 

ఇక మూవీ ప్రమోషన్స్ లో రామ్ పోతినేని జాయిన్ అయ్యారు. ఇప్పటికే యాంకర్ సుమతో రామ్, శ్రీలీలా ఇంటర్వ్యూ చేశారు. సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. అలాగే Bigg Boss Telugu 7 హౌజ్లోకి రామ్ ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో కంటెస్టెంట్లతో ఆడి హుషారు తెప్పించారు. తన సినిమానూ ప్రమోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ లుక్, పెళ్లి, తదితర అంశాలపై బిగ్ బాస్, కంటెస్టెంట్లు ప్రశ్నలు సంధించారు. రామ్ మాత్రం స్మార్ట్ ఆన్సర్ తో ఆకట్టుకున్నారు. 

ఇప్పటికే చిత్రం నుంచి టీజర్, ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరోవైపు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సంగీతం కూడా అదిరిపోయింది. రామ్ పోతినేని - ఊర్వశీ రౌటేలా కలిసి ఆడిన మాస్ జాతర ‘కల్ట్ మామా’కు క్రేజీ రెస్పాన్స్ దక్కింది. మిగితా సాంగ్స్ కూడా సంగీత ప్రియులను మెప్పించాయి. బోయపాటి సినిమాకు తగ్గట్టుగా పాటలు ఊపుతున్నాయి. 

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15నే విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో రిలీజ్ కు నాలుగైదు రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ కూడా చీఫ్ గెస్ట్ గా హాజరై ఆయన స్పీచ్ తో హోరెత్తించారు. కానీ అనుకోకుండా సినిమాను వాయిదా వేశారు. దీంతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించేందుకు కరీంనగర్ గడ్డపై ఈవెంట్ ప్లాన్ చేశారు. వీ కన్వెన్షన్ హాల్ లో ‘కల్ట్ జాతర’ పేరుతో ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios