సక్సెస్ ఫెయిల్యూర్ చాలా వరకు మన నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటాయి. కథలను, స్క్రిప్ట్స్ ని సరిగా జడ్జి చేసినప్పుడు విజయాలు దక్కుతాయి. అయితే రామ్ పోతినేని హిట్ స్క్రిప్ట్స్ పక్కన పెట్టి ప్లాప్ స్క్రిప్ట్ కి ఓటేశారు. 

రామ్ పోతినేని (Ram Pothineni)లేటెస్ట్ మూవీ ది వారియర్. జులై 14న విడుదలైన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దర్శకుడు లింగుస్వామి ది వారియర్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాడు. తెలుగులో ఈ మూవీ రూ. 15 నుండి 17 కోట్ల నష్టం మిగిల్చింది. ఉత్తరాంధ్ర, నైజాం ఏరియాల్లో రామ్ సొంతగా విడుదల చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. కాబట్టి ఆర్థికంగా కూడా ది వారియర్ మూవీతో రామ్ నష్టపోయాడు. 

ఈ మూవీ ప్రమోషన్స్ లో రామ్ పోతినేని ఓ కామెంట్ చేశారు. నేను నాలుగైదు పోలీస్ కథలను విన్నాను. ఒక్కటి కూడా నచ్చలేదు. దీంతో పోలీస్ స్టోరీస్ చేయకూడని డిసైడ్ అయ్యాను. అప్పుడు లింగుస్వామి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా నిర్ణయం మార్చుకొని ది వారియర్ మూవీ చేశాను అన్నారు. కెరీర్ లో మొదటిసారి రామ్ పోలీస్ పాత్ర ట్రై చేయగా బెడిసికొట్టింది. అయితే రామ్ రిజెక్ట్ చేసి ఆ నాలుగైదు పోలీస్ స్క్రిప్ట్స్ లో క్రాక్ కూడా ఒకటని సమాచారం.

దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజ కంటే ముందు క్రాక్ స్క్రిప్ట్ రామ్ కి వినిపించాడట. కథ నచ్చకపోవడంతో రామ్ రిజెక్ట్ చేశాడట. కాగా క్రాక్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. రవితేజకు చాలా కాలం తర్వాత ఓ భారీ హిట్ క్రాక్ తో దక్కింది. 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఆ విధంగా రామ్ క్రాక్ చిత్రాన్ని పక్కనపెట్టి ది వారియర్ మూవీ చేసి దెబ్బైపోయాడు.

ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం అనంతరం రామ్ చేసిన రెడ్, ది వారియర్ వరుసగా ప్లాప్ అయ్యాయి. ఇక రామ్ ఆశలన్నీ బోయపాటి శ్రీను మూవీ పైనే. ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. అఖండ మూవీ అనంతరం బోయపాటి శ్రీను నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.