బ్యాచులర్ లైఫ్ అంటే ఆనందమో లేక పెళ్లంటే అదో గోల అనుకుంటున్నారేమో తెలియదు గాని చాలా వరకు నేటితరం సినీ హీరోలు పెళ్లంటే భయపడిపోతున్నారు. ఇంట్లో ఎంత బలవంత పెట్టినా కూడా చాలా చాకచక్యంగా తప్పించుకుంటూ పెళ్లిని వాయిదా వేసేస్తున్నారు. 

టాలీవుడ్ బ్యాచులర్స్ లిస్ట్ తీస్తే చాలా పేద్దగానే ఉంటుందని చెప్పవచ్చు. అందులో రామ్ కూడా ఉన్నాడు. ఈ కుర్ర హీరో చిత్ర పరిశ్రమలోకి వచ్చి 12 ఏళ్ళు పూర్తికావోస్తోంది. వయసు మూడు పదుల్లోకి వచ్చేసింది. అయితే గత మూడేళ్ళుగా రామ్ ఇంట్లో పెళ్లి గోల మాములుగా లేదు. పెళ్లి చేసుకోరా అంటూ చిన్నా పెద్ద అంతా తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట.

అయితే రామ్ మాత్రం ఎవ్వరిని హార్ట్ చేయకుండా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడట. "ఇదొక్క సినిమా కానివ్వండి నేనే చెప్తా" అని పెళ్లి ప్రస్తావనను డైవర్ట్ చేస్తున్నాడట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ ఈ విషయాన్ని చెప్పాడు. ఏ మాత్రం తొందరపడకుండా ఇంట్లో వాళ్లకు ప్రతిసారి ఈ సమాధానం చెబుతూ తప్పించుకుంటున్నా అని రామ్ వివరించాడు.