Asianet News TeluguAsianet News Telugu

రామ్ పోతినేని-బోయపాటి శ్రీను మూవీ రెగ్యులర్ షూటింట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే...?

ఊరమాస్ సినిమా చేయబోతున్నాడు రామ్ పోతినేని. ఆ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటితో జతకట్టాడు. మరి ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది. కాని.. ఇంత వరకూ సినిమా స్టార్ట్ అవ్వలేదు. మరి ఈమూవీ షూటింగ్ ఎప్పుడు మరి. 
 

Ram Pothineni and Boyapati Combo Movie Shooting Update
Author
First Published Sep 29, 2022, 7:03 AM IST

వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు రామ్ పోతినేని.. రీసెంట్ గా వారియర్ సినిమాతో మరో ప్లాప్ ను అందుకున్నాడు. ఇక సాలిడ్ సక్సెస్ కోసం  ఎదురు చూస్తున్న రామ్.. ఈసారి బోయపాటితో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కాని ఇంత వరకూ ఈమూవీ షూటింగ్ పై ఎటువంటి అప్ డేట్ లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఎనర్జిటిక్ స్టార్ ఫ్యాన్స్. 

అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న  సినిమా ప్రేమికుల ఓ అప్‌డేట్ వ‌చ్చింది. రెగ్యుల‌ర్ షూటింగ్ అక్టోబ‌ర్ 6 నుంచి మొద‌లు కాబోతున్నట్టు తెలుస్తోంది.  పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం భారీగా కాస్ట్ ను సెట్ చేశాడట బోయపాటి. బోయపాటి గురంచి తెలిసిందే.. ఆయన సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో.. దానికి తగ్గట్టే చిన్న పాత్ర కోసం అయినా.. పెద్ద నటులను తీసుకుంటారు బోయపాటి. ఇక ఈసినిమాల్లో  కూడా  ప్ర‌ముఖ నటీన‌టులు, సాంకేతిక నిపుణులు సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది.  

ఎస్ థ‌మ‌న్ ఈ సినిమాకు  మ్యూజిక్ అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు  సంబంధించిన పూర్తి వివ‌రాల‌ పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. అఫీషియల్ గా  మూవీపై అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు ఈసినిమాలో రామ్ సరసన  ప్రముఖ మోడ‌ల్ సాక్షి వైద్య  హీరోయిన్‌గా ఫైన‌ల్ చేయ‌బోతున్నాడంటూ న్యూస్ వినిపిస్తోంది. ఈ విషయంలో కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 

ఈ ఏడాది లింగుస్వామి డైరెక్ష‌న్‌లో బై లింగ్యువ‌ల్ ప్రాజెక్టుగా తెర‌కెక్కిన‌ ది వారియ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు రామ్. అయితే ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఇక ఈ సారి ఏకంగా వ ప్రాజెక్టుగా వ‌స్తున్న పాన్ ఇండియా సినిమాతో హిట్టు కొట్టాల‌ని చూస్తున్నాడు. కాని ఎందుకో ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు మాస్ సినిమాలు కలిసి రావడంలేదు .. మరి ఈ ఊరమాస్ సినిమా రామ్ కు ఎంత వరకూ కలిసి వస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios