Asianet News TeluguAsianet News Telugu

సైలెంట్ గా కొత్త సినిమా మొదలెట్టిన రామ్ , డైరక్టర్ ఎవరంటే...

 మైత్రీ మూవీస్ వారు భారి మొత్తం రామ్ కు  అడ్వాన్స్ గా ఇచ్చి ఉండటంతో   అదే బ్యానర్ లో సినిమా ఓకే చేసి లాంచ్ చేసారు. 

Ram next film Launched in a low key affair jsp
Author
First Published Jun 11, 2024, 1:48 PM IST


ఉస్తాద్ రామ్ పోతినేని సైలెంట్ గా కొత్త సినిమా మొదలెట్టేసారు. మైత్రీ మూవీస్ వారు భారీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా దర్శకుడు హరీష్ శంకర్ కానీ ,త్రివిక్రమ్ కానీ కాదు. మరెవరు. వివరాల్లోకి వెళితే..

రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్ “..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా  వచ్చే నెలలో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఈ క్రమంలో హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీస్ వారు భారి మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చి ఉండటంతో   అదే బ్యానర్ లో సినిమా ఓకే చేసి లాంచ్ చేసారు. 

 ఈ చిత్రాన్ని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు డైరక్ట్ చేయనున్నారు. మహేష్ బాబు చెప్పిన స్క్రిప్టు ఓకే చేసిన రామ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో నిన్న సోమవారం మంచి రోజు అని సినిమాని లాంచ్ చేసారు. అయితే ఎక్కడా ఫొటో కూడా రిలీజ్ చేయలేదు. షూటింగ్ మొదలయ్యాక అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్, లీడ్ అర్టిస్ట్ లు, కీ టెక్నీషియన్స్ ఓకే అయ్యారని సమాచారం. ఆగస్ట్ నుంచి షూటింగ్ కు వెళ్లనుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా వచ్చే వేసవి రిలీజ్ టార్గెట్ చేయనున్నారు. 

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పి.మహేష్.. రామ్ ను డైరక్ట్ చేయబోవటం మంచి ప్రమోషన్ క్రింతే లెక్క.  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత తన తదుపరి చిత్రాన్ని మైత్రీతో చేయడానికి మహేష్ కమిట్ అయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం మంచి కథ రెడీ చేశాడు. ఈ కథ రామ్ కు బాగా నచ్చింది. రామ్‌తో భారీ ఎమోషనల్ డ్రామా ప్లాన్ చేశాడు మహేష్.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రామ్ సినిమా చేయడం ఇదే తొలిసారి.
 
ఇక డబుల్ ఇస్మార్ట్ శంకర్ విషయానికి వస్తే  బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ కు అద్భుతమైన మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సారి డబుల్ ఇస్మార్ట్ కు బ్లాక్ బస్టర్ ట్యూన్స్ అందిస్తున్నాడు.ఈ సినిమాను పూరీజగన్నాధ్ ,ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మరో ప్రక్క  స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన తరువాత మూవీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాను రామ్ తన సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మేరకు స్రవంతి రవి కిషోర్ ..త్రివిక్రమ్ తో చర్చలు జరుపుతున్నారు. త్రివిక్రమ్ కు, రవి కిషోర్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. త్రివిక్రమ్ కెరీర్ ప్రారంభంలో స్రవంతిలో సినిమాలు చేసారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios