ఎనర్జిటిక్ స్టార్ గా పేరు పడ్డ రామ్ ఆ మధ్య కాస్త స్లో అయ్యారు కానీ ..ఇప్పుడు మళ్లీ వరస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం చేస్తున్న రామ్ త్వరలో ఓ తమిళ రీమేక్ లో చేయనున్నారని సమాచారం. తమిళంలో సూపర్ హిట్టైన తాడమ్ చిత్రం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అరుణ్ విజయ్ హీరోగా రూపొందిన ఆ చిత్రం ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్.  

ఒకే పోలికలతో ఉన్న హీరో చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక హీరో మర్డర్ చేస్తారు. అయితే ఎవరు మర్డర్ చేసారనేది చివరి వరకూ తేలదు. ఇద్దరికి మర్డర్ చేసారనేందుకు క్లూ దొరుకుతూంటాయి. కానీ బలమైన ఎలిబి దొరకదు. దాంతో పోలీసులు అసలు హంతకుడు వీరిద్దరిలో ఎవరు అనేది తేల్చటానికి రకరకాల స్కెచ్ లు వేస్తూంటారు. కథనం చాలా గమ్మత్తుగా ఉంటుంది. 

పోలీస్ లకు  దొరికే ప్రతీ క్లూ...సమాధానాలకు లీడ్ చెయ్యకుండా అనేక ప్రశ్నలకు దారి తీస్తుంది. వాటిని ఛేధిస్తూ వాళ్లు ఎలా హంతకుడుని పట్టుకున్నాడనేది ఇంట్రస్టింగ్ గా జరిగే కథనం. ఇక ఈ చిత్రాన్ని చూసిన రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ వెంటనే నచ్చి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది రైటర్స్ తో కూర్చుని తెలుగు నేటివిటిని ఈ కథకు అద్దే పనిలో ఉన్నారని తెలుస్తోంది. స్క్రీప్టు ఓ కొలిక్కి వచ్చాక..దర్శకుడు ఎంపిక జరుగుతుందని చెప్తున్నారు.