పవన్ గిల్లుడులో నేల టికెట్టు కలెక్షన్స్: వర్మ

ram gopal varma vulgar comments on pawan kalyan
Highlights

వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి 

వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ పై వల్గర్ కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కాడు. ఇటీవల రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పవన్ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చాలా సరదాగా కనిపించారు. ఆయన పక్కనే కూర్చున్న రవితేజ టార్న్ జీన్స్ వేసుకొని వచ్చారు. ఆ జీన్స్ పై పవన్ జోకులు వేస్తూ.. రవితేజ కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ రోజురోజుకి మరింత యంగ్ అయిపోతున్నారంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రవితేజ వేసుకున్న జీన్స్ ను పట్టుకొని చూశారు. ఆ టైం లో మీడియాపవన్ ను కవర్ చేయడంతో రవితేజ తొడపై పవన్ చేయి వేసినట్లుగా ఉంది. ఇది పట్టుకొని యాంటీ ఫ్యాన్స్ పవన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

తాజాగా దర్శకుడు వర్మ కూడా ఈ విషయమపై స్పందిస్తూ.. ''అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందని ఎక్స్ ప్రెషన్ బట్టి రవితేజ ముఖలో క్లియర్ గా 'టచ్ చేసి చూడు' అనే టైపులో క్లియర్ గా తెలుస్తుంది. కానీ ఈ సీక్రెట్ మెగా ఫ్యామిలీకు జనసేన పార్టీకు తెలిసుండదు. బట్ పీకే గిల్లుడులో నేల టికెట్టు కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. రవితేజకు, పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఉన్న ఈ తొడ సంబంధం గురించిన లోగుట్టు జనసేన పార్టీకే తెలియై.. కానీ పీకేకి,రవి ఎడమ తొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకే మోహంలో ఉన్న ఆనందంలో కనబడుతుంది. పవన్ కళ్యాణ్ కానీ రవితేజ తొడ మీద ఉన్న తన అత్యంత శ్రద్ధని జస్ట్ సగం రెండు రాష్ట్రాల మీద పెడితే అబ్బో.. అత్యంత సస్యశ్యామలం. రవితేజ ఎడమ తొడకి.. పవన్ కళ్యాణ్ కుడి చేతికి ఉన్న అవినవభావసంబంధం ఆ దేవుడికే తెలియాలి'' అంటూ తనకు ఇష్టమొచ్చినట్లుగా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. గతంలో కూడా వర్మ.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి తీసుకున్న ఫోటోను ఉద్దేశించి టాలీవుడ్ లో గే కల్చర్ అంటూ ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. అయితే నెటిజన్లు మాత్రం నీ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారుడు అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. 

loader