ఏపీలో జరుగుతున్న టికెట్ రేట్స్ ఇష్యూ పై స్పందించారు రామ్ గోపాల్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ.. హీరోలు లేకుంటే థియేటర్లకు జనాలు ఎందుకు వస్తారన్నారు.

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇష్యూ ఏదైనా తనదైన శైలిలో స్పందిస్తారు. వర్మ మార్క్ అంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంచలనాల దర్శకుడు. అవతలి వాళ్లు ఎవరు అని చూడకుండా.. భయపడకుండా.. ముక్కుసూటిగా మాటలు విసరడంలో వర్మ స్టైలే వేరు. ఏదైనా ఇష్యూ మీద భయపడకుండా సినిమాచేయాలి అంటే.. అది వర్మకే సాధ్యం. అందుకే ఆయన సంచలనం అయ్యారు.

సినిమాల విషయంలోనే కాదు. ప్రతీ విషయంలో వర్మ స్పందన కోసం ఎదురు చూస్తుంటారు ఆడియన్స్. ఎందుకంటే రాజకీయాల విషయంలో కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటాడు Ram Gopal Varma. ఇక రీసెంట్ గా ఏపిలో టికెట్ రేట్స్ గురించి తన మార్క్ స్టైల్ లో స్పందిచారు వర్మ. టికెట్ రేట్లు.. సామాన్యుడికి టికెట్ అందుబాటులో ఉండటం.. హీరోల రెమ్యూనరేషన్ కు అసలు సంబంధమే లేదు అన్నారు. థియేట్లకు జనాలు నిర్మాతలను చూసి రారు.. ఎవరు నిర్మించారు అని ఆడియన్స్ చూడరూ..హీరోలను చూసే జనాలు థియేటర్స్ కు వస్తారు. అటువంటప్పుడు ఆహీరోలే.. లేకుంటే సినిమాలు ఎలా నడుస్తాయి అన్నారు.

తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో రాజమౌళి పెంచారు. దాని వల్ల మన సినిమా రెవిన్యూ రెట్టింపు అయ్యింది. కాని కోటి రూపాయలు పెట్టి తీసిని సినిమాకు..వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమాకు టికెట్ రేటు ఒకే విధంగా ఉండాలి అనుకోవడం అన్యాయం అన్నారు వర్మ.టికెట్ అయినా.. ఇంకేదైనా వస్తువు అయినా.. ఎంత రేటు అనేది అమ్మేవారు.. కొనేవారు మధ్య అవగాహన బట్టి.. అభిరుచిని బట్టి.. స్థాయిని బట్టి.. ఉంటుంది అన్నారు. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల సినిమా ప్రమాణాలు పడిపోతాయన్నారు వర్మ. సినిమాలను నిత్యవసర వస్తువలతో పొల్చడం సరికాదన్నారు.

ఆడియన్స్ కు భారం పడకూడదు అని టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాం అని ఏపీ ప్రభుత్వం చెప్పడంలో అర్ధం లేదు. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల హీరోల రెమ్యూనరేషన్లు ఏమీ తగ్గవు. అసలు హీరోలు లేనిదే సినిమాలే లేవు.. అలాంటప్పుడు జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారన్నారు వర్మ. ప్రస్తుత సమస్యపై సినిమా పెద్దలు మాట్లాడకపోవడంపై సెటైరికల్ గా సమాధానం చెప్పారు వర్మ. సినిమా పెద్దలంతా బాగా సెటిలైన వారు, వారు ప్రభుత్వంతో గొడవెందుకు పెట్టుకుంటారు. సినిమా పెద్దలు మాట్లాడకపోవడంలో పెద్ద వింతేమి లేదన్నారు వర్మ.

ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే.. రామ్ గోపాల్ వర్మ... ఈసారి కూడా మరో కాంట్రవర్సీయల్ మూవీతో రాబోతున్నారు. వరంగల్ నేపథ్యంలో కొండా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.. వర్మకు ఇప్పటికే ఎన్నో బెదిరింపులు కూడా వచ్చినట్టు.. పలు సందర్భాలలో ఆయనే చెప్పారు. అయినా సరే కొండా సినిమాపై తగ్గేదే లే అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.

Ajith Valimai : వాలిమై మూవీకి తెలుగులో క్రేజీ టైటిల్..? ఫ్యాన్స్ కు అజిత్ న్యూ ఇయర్ ట్రీట్