వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏదే చేసినా డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని కొందరు క్రియేటివిటీ అంటే, మరికొందరు పిచ్చి అంటుంటారు. మొత్తానికి ఆయన చేసే ప్రతి పని, పెట్టే ప్రతి పోస్ట్ చర్చనీయాంశంగానే ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని పంచుకున్నాడు వర్మ. ఇది వర్మ ఫేస్‌ని ఏంజెల్‌ లాగా మార్చిన పెయింటింగ్‌.

ఇందులో వర్మ చెవులో పైకి లాగి, తలపై రెండు కొమ్ములు మాదిరిగా వేసిన పెయింటింగ్‌ ఫోటో. దీన్ని తన ఇన్‌స్టాలో వర్మ పంచుకుంటూ `ఈ ఎంజేల్‌ ఎవరో నేను మర్చిపోయా?` అంటూ కామెంట్‌ పెట్టాడు. ఇందులో తన పేరుతో ఉన్న యాష్‌ ట్యాగ్‌లతోపాటు `డెవిల్‌ఏంజెల్‌` అనే ఒక యాష్‌ ట్యాగ్‌ని కూడా పంచుకున్నాడు. దీనిపై నెటిజన్లు స్పందించి కామెంట్లు పెడుతున్నారు. `నువ్వు ఏంజెల్‌లాగే ఉంటావు. కానీ ఆ విషయం మర్చిపోయావ్‌`అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు `దీన్ని కామ పిశాచి అంటారు. నీకు తెలియదా?` అని కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ ఫోటో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. 

ప్రస్తుతం వర్మ రూపొందించిన `దెయ్యం` సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఇందులో రాజశేఖర్‌, ప్రసన్న దంతులూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసన్నతో కలిసి వర్మ దిగిన క్లోజ్డ్ ఫోటోలను సైతం ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.