సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చంద్రబాబు నిజ స్వరూపాన్ని చూపించానని చెప్పుకుంటున్న వర్మ ఇప్పటికీ తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఏపీలో తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను అడ్డుకోవడంతో టీడీపీపై మరింత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. తాజాగా టీడీపీకి షాక్ ఇచ్చే ఓ ట్వీట్ చేశాడు వర్మ. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా చూసిన తరువాతే చంద్రబాబుకి ఓటు వేయాలని కోరారు.

నారా లోకేష్ టీడీపీకి నిజమైన వారసుడు కాదని చెప్పిన వర్మ జూనియర్ ఎన్టీఆరే అసలైన వారసుడని పేర్కొన్నాడు. టీడీపీ పార్టీ భవిష్యత్తు కూడా జూనియర్ ఎన్టీఆరే అని చెప్పాడు. ఇది చూసిన నెటిజన్లు సరిగ్గా చెప్పారని, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నామని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…