Asianet News TeluguAsianet News Telugu

బాలు, రఫీ జూనియర్‌ ఆర్టిస్ట్స్‌.. బాలయ్య పాటపై వర్మ పంచ్‌

బాలకృష్ణ పాడిన పాట మీద వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. బాలయ్య పాడిన పాట వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ.. `వావ్‌.. మహ్మద్‌ రఫీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గానంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ లలా అనిపిస్తున్నారు. బాలయ్య పాట వింటుంటే శ్రోతల హార్ట్ బీట్‌ పెరిగిపోతోంది.

Ram Gopal Varma Satires on Balakrishna Sivasankari Song
Author
Hyderabad, First Published Jun 10, 2020, 9:21 AM IST

నందమూరి బాలకృష్ణ.. తన 60వ పుట్టిన రోజు సందర్భంగా డబుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. తండ్రి నటించిన శివ శంకరి పాటను స్వయంగా ఆలపించి ఓ వీడియోను రిలీజ్ చేసిన బాలయ్య, తన తాజా చిత్రానికి సంబంధించి టీజర్‌ను కూడా రిలీజ్‌  చేశాడు. బాలయ్య టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రాగా, శివ శంకరి పాటకు మాత్రం మిక్స్‌డ్‌ రెస్సాన్స్‌ వస్తోంది.

అయితే ఈ పాట మీద వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. బాలయ్య పాడిన పాట వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ.. `వావ్‌.. మహ్మద్‌ రఫీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గానంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ లలా అనిపిస్తున్నారు. బాలయ్య పాట వింటుంటే శ్రోతల హార్ట్ బీట్‌ పెరిగిపోతోంది. ఒతెల్లో శంకర శాస్త్రీ కలిపినట్టుగా మోజర్ట్ మ్యూజికల్ లాండ్‌ స్కేప్‌ ఇచ్చినట్టుగా ఉంది` అంటూ ట్వీట్ చేశాడు.

అయితే వర్మ సెటైరికల్‌గానే ఈ ట్వీట్ చేశారన్న భావన వ్యక్తమవుతోంది. ఈ మేరకు పలువురు నెటిజెన్లు కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లపై స్పందించిన వర్మ, `కొంత మంది చెడ్డవారు నేను జోక్ చేస్తున్నా అంటున్నారు. కానీ నేను దేవుడి మీద, బాలయ్య మీద ఒట్టేసి చెపుతున్నా.. నేను మ్యూజిక్‌ అనే ప్రపంచానికి పరిచయం అయిన దగ్గర నుంచి ఇదే గ్రేట్‌ సాంగ్‌. ఈ పాట విని ఎన్టీఆర్ స్వర్గంలో డ్యాన్స్‌ చేస్తుంటాడు` అంటూ కామెంట్ చేశాడు.

అదే సమయంలో బాలయ్య టీజర్ మీద కూడా స్పందించాడు వర్మ. `హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు బాలయ్య బాబు. బీబీ 3 టీజర్‌తో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను మరిపించినందకు కృతజ్ఞతలు` అంటూ కామెంట్‌ చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios