వివాదాస్పద దర్శకుడిగా టర్న్ తీసుకున్న రామ్‌గోపాల్‌ వర్మ.. ఏం చేసినా హాట్‌ టాపిక్ అవుతుంది. తాజాగా ఆయన `ది కేరళ స్టోరీ` సినిమాపై ట్వీట్‌ చేశారు. అది వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఇండియాలో హాట్‌ టాపిక్‌గా మారిన సినిమా `ది కేరళ స్టోరీ`. కేరళలో హిందూ, క్రిస్టియన్‌ అమ్మాయిలు మతమార్పిడి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. బలవంతంగా జిహాదీలుగా మారుస్తున్నారని, ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ నెమ్మదిగా పుంజుకుంటోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కలెక్షన్లు పెరిగాయి. ఆదివారం సైతం పెరిగినట్టు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఈ సినిమాలో ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా ప్రధాన పాత్రల్లో నటించారు. సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న నేపథ్యంలో తాజాగా వర్మ తన మార్క్ ట్వీట్‌ చేశారు. పాన్‌ ఇండియా సినిమాకి కొత్త అర్థాన్ని చెప్పారు. ఈసినిమాని కంపేర్‌ చేస్తూ, `తమిళం, మలయాళం గర్ల్స్ ప్రధాన పాత్రల్లో నటించారని, గుజరాతికి చెందిన వ్యక్తి నిర్మించాడని, బెంగాళీ డైరెక్టర్‌ రూపొందించాడ, హిందీ సినిమాగా తెరకెక్కిందని, ఇప్పుడు ఇండియాలోని అన్ని భాషల్లో ఇది బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుందని, `ది కేరళస్టోరీ` నిజమైన పాన్‌ ఇండియా మూవీ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

Scroll to load tweet…

ఇదిలా ఉంటే మే 5న విడుదలైన `ది కేరళ స్టోరీ` చిత్రానికి కొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా కేరళలో తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. అక్కడ చాలా చోట్ల షోలు అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. అలాగే తమిళనాడులోనూ మల్టీఫ్లెక్స్ అసోసియేషన్‌ దీన్ని బాయ్‌ కాట్‌ చేయాలని నిర్ణయించారట. లా అండ్‌ ఆర్డర్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో రక్షణ నేపథ్యంలో దీన్ని బాయ్‌కాట్‌కి పిలుపినిచ్చారట. అయితే సినిమా ప్రధానంగా మతవిధ్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సినిమాలు సమాజానికి హానీ చేస్తాయని అంటున్నారు. మరికొందరు ఇలాంటి సినిమా చూడాలని, జిహాదీ పేరుతో ఎంతటి దుర్మార్గాలు తెలుస్తుందంటున్నారు. మొత్తానికి వివాదాస్పదంగా మారిన ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తుండటం విశేషం.