Asianet News TeluguAsianet News Telugu

నీ ఆత్మ అందంగా ఉంది, పూనమ్ పాండేపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే విషయంలో డిఫరెంట్ గా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. అనుకున్నట్టుగా, అందరు ఎదురుచూసినట్టుగానే వర్మ తన మార్క్ కామెంట్ తో ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

Ram Gopal Varma Interesting Comments about Bollywood Star Poonam Pandey JMS
Author
First Published Feb 3, 2024, 3:57 PM IST | Last Updated Feb 3, 2024, 5:09 PM IST

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే విషయంలో డిఫరెంట్ గా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. అనుకున్నట్టుగా, అందరు ఎదురుచూసినట్టుగానే వర్మ తన మార్క్ కామెంట్ తో ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

ఇండస్ట్రీలో కాని.. పాలిటిక్స్ లో కాని.. ఏ రంగంలో అయినా సరే మనదేశంలో ఏదైనా కాస్త విచిత్రంగా జరిగితే.. అందరూ కొంత మంది కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసే సెలబ్రిటీల వైపు చూస్తుంటారు. అందులో ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఏదైనా ఇష్యు జరిగితే వర్మ స్పందన ఎలా ఉంటుందా అని అంతా ఆయన సోషల్ మీడియా వైపు చూస్తారు. అనుకున్నట్టుగానే వర్మ కూడా జనాలను డిస్సపాయింట్ చేయకుండా.. తన మార్క్ కామెంట్ తో సందడి చేస్తాడు. తాజాగా మరోసారి తన మాటలకు పదును పెట్టాడు వర్మ.   

ప్రస్తుతం బాలీవుడ్ లో పూనమ్ పాండే ఇష్యు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వివాదాలలో మునిగిపోయి ఉన్న పూనమ్.. ప్రస్తుతం గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతుంది. అయితే ఆమె చేసిన ఓ పిచ్చి పని కారణంగా విమర్షలు ఫేస్ చేస్తోంది. సర్వికల్ క్యాన్సర్   కారణంగా సినీ నటి పూనమ్ పాండే చనిపోయారనే వార్త సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. కాని ఈ విషయంలో మొదటి నుంచీ గందరగోళం నెలకొంది. పీఆర్ టీమ్ చెప్పినపొంతనలేనిసమాధానాల వల్ల అందరికి అనుమానం కూడా కలిగింది. 

 

ఇక ఈ విషయం ఎక్కడికి వెళ్తుందో అని భయపడిన పూనమ్ పాండే..  తాను చనిపోలేదని, సర్వైకల్ క్యాన్సర్ పై మహిళ్లలో అవగాహన కల్పించేందుకు తాను మృతి చెందినట్టు ప్రచారం చేశానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో పూనమ్ కు కొంత మంది సపోర్ట్ చేస్తుంటే మరికొం తమంది మాత్రం ఆమెను విమర్షిస్తున్నారు. ఈక్రమంలో ఎక్స్ వేదికగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ పూనమ్ పై ప్రశంసలు కురిపించారు. 

ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. హేయ్ పూనమ్ పాండే... క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న ఈ కొత్త  విధానంపై కొంత విమర్శలు రావచ్చు కాని..  కానీ, ఈ కల్పిత ప్రచారం ద్వారా... నీవు సాధించిన దాన్ని, నీ మంచి ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోంది. నీ మాదిరే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. సంపూర్ణమై, సంతోషకరమైన జీవితం నీకు ఉండాలని కోరుకుంటున్నా' అని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios