Asianet News TeluguAsianet News Telugu

మాలాంటి మెచ్యూరిటీ రావడానికి మీకు టైమ్ పడుతుంది- వర్మ

ఈ సమాజం ఎటు పోతుంది, ఏదో అయిపోతుంది అంటూ లైఫ్ నాశనం చేసుకోవద్దు. లైఫ్ లో కొంచెం ఛిల్ అవ్వండి. దేవుడు ఇచ్చిన ఆ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ని మరీ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వర్మ అన్నాడు. 

ram gopal varma free suggestion dont take life serious just chill ksr
Author
Hyderabad, First Published Jun 30, 2021, 3:51 PM IST

రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ ఫేమ్ అరియానా ల ఇంటర్వ్యూ యూట్యూబ్ లో సంచలనం రేపింది. ఇప్పటి వరకు వివిధ ఛానెల్స్ లో కలిపి ఆ ఇంటర్వ్యూ నాలుగు మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టినట్లు తెలుస్తుంది. అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ పేరుతో విడుదలైన ఈ ఇంటర్వ్యూలో అరియానా అంగాంగ సౌందర్యం వర్ణించాడు వర్మ. అలాగే ఆమె శరీరంపై పచ్చిగా కొన్ని కామెంట్స్ చేశారు. 


ఎప్పటిలాగే వర్మ క్రియేటివిటీ నచ్చనివాళ్ళు ఆయనను తీవ్రంగా విమర్శిచడం జరిగింది. అరియానా తో తన ఇంటర్వ్యూపై నెగిటివ్ కామెంట్స్ చేసినవారి కామెంట్స్ కి వర్మ స్పందించారు. మా ఇంటర్వ్యూ వీడియో చూసి నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను అంటూనే... మా అంతటి మెచ్యూరిటీ మీకు లేదంటూ ఎద్దేవా చేశాడు. ఆ పరిణితి రావడానికి ఇంకా సమయం మీకు పడుతుందని చెప్పిన వర్మ, అలాంటి వారికి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. 


ఈ సమాజం ఎటు పోతుంది, ఏదో అయిపోతుంది అంటూ లైఫ్ నాశనం చేసుకోవద్దు. లైఫ్ లో కొంచెం ఛిల్ అవ్వండి. దేవుడు ఇచ్చిన ఆ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ని మరీ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వర్మ అన్నాడు. అదే సమయంలో అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ వీడియోకు కొన్ని జిమ్మిక్కులు కలిపి, మిక్స్డ్ వర్షన్ వదినట్లు చెప్పాడు. అది కూడా మీరు చూసి, ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయాలని అన్నాడు. దాని వలన మాకు వ్యూస్ పెరుగుతాయని చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios