తాజాగా అమెరికాలో జరిగిన మెట్ గాలా వేడుకలో ప్రియాంక వేసుకున్న డ్రెస్, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

తాజాగా అమెరికాలో జరిగిన మెట్ గాలా వేడుకలో ప్రియాంక వేసుకున్న డ్రెస్, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. పిచ్చుక గూడు లాంటి హెయిర్ స్టైల్ తో ఉన్న ప్రియాంక ఫోటోలను రకరకాలుగా మీమ్స్ చేశారు. దారుణంగా సెటైర్లు వేశారు. 

ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రియాంక హెయిర్ స్టైల్ పై కామెంట్ చేశారు. ప్రియాంకకి అలాంటి హెయిర్ స్టైల్ చేసిన హెయిర్ స్టైలిస్ట్ కి సెల్యూట్ చేశారు.

ప్రియాంక జ‌ట్టును, వీర‌ప్ప‌న్ మీసం కింద అమ‌ర్చిన ఫోటోను షేర్ చేస్తూ.. 'ఎంతో ప్ర‌సిద్ధి చెందిన ఆ మీస‌క‌ట్టు కింద ఈ హెయిర్‌స్టైల్ స‌రిగ్గా స‌రిపోయింది. వీర‌ప్ప‌న్ మీసం త‌ర‌హాలో ప్రియాంక హెయిర్ స్టైల్‌ను మార్చిన ఆ హెయిర్ స్టైలిస్ట్‌కి వ్య‌క్తిగ‌తంగా సెల్యూట్ చేస్తున్నా. ఐ ల‌వ్ ఇట్‌' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

తనకు ఆ హెయిర్ స్టైల్ అంతగా ఎందుకు నచ్చిందో మరికొన్ని గంటల్లో చెబుతానని అన్నారు. 

Scroll to load tweet…