పవన్ ఫ్యాన్స్ 11వేల మందేనా: వర్మ

First Published 8, May 2018, 2:10 PM IST
ram gopal varma comments on pawan and his fans
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అతడి అభిమానులను టార్గెట్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అతడి అభిమానులను టార్గెట్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే అక్కినేని నాగార్జున హీరోగా వర్మ 'ఆఫీసర్' అనే సినిమాను రూపొందించారు. ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ టీజర్ కు ఎన్ని లైక్స్ వచ్చాయో.. అన్ని డిస్ లైక్స్ కూడా వచ్చాయి. వర్మ చూసే సమయానికి టీజర్ కు 11 వేల డిస్ లైక్స్ వచ్చాయి. దీంతో వర్మ..

''11 వేల కోట్ల మంది తెలుగు ప్రజల్లో పవన్ అభిమానుల సంఖ్య 11 వేలేనా.. ఆయన అభిమానిగా నేను షాక్ అవుతున్నా.. మా సినిమా టీజర్ ను ఇంకా వేల మంది డిస్ లైక్ చేసి పవన్ ఫ్యాన్స్ తక్కువ కాదని నిరూపించాలి. జనసేన పార్టీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. లేదంటే ఈ పార్టీ కూడా ప్రజారాజ్యంలా డిజాస్టర్ అవుతుంది'' అంటూ 
సోషల్ మీడియాలో కామెంట్ చేసాడు వర్మ. శ్రీరెడ్డి ఉదంతం విషయంలో పవన్ అభిమానులు వర్మకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిండ్. అందుకే ఇప్పుడు వారిని కామెంట్ చేస్తూ వర్మ ఈ విధంగా రివెంజ్ తీర్చుకునే ప్లాన్ చేస్తున్నాడు. అయితే దీనిపై పవన్ ఇప్పటివరకు స్పందించలేదు. 
 

loader