చిరంజీవి పద్మ విభూషన్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు.. మండిపడుతున్ నెటిజన్లు
రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన వక్రబుద్ది బయటపెట్టుకున్నడు. పద్మవిభూషన్ వరించిన చిరంజీవిపై తన మార్క్ అర్ధం పర్ధం లేనికామెంట్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
రామ్ గోపాల్ వర్మ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పడం కష్టం. ఎవరిమీద పాజిటీవ్ గా ఉంటడో.. ఎవరిమీద నెగెటీవ్ గా మాట్లాడుతాడో కూడా చెప్పలేదు. ఏ విషయంలో స్పందిస్తాడో.. ఏవిషయంలో కామ్ గా ఉంటాడో కూడా చెప్పడం కష్టం. కాని వర్మ మార్క్ కామెంట్లుమాత్రం ఒక్కోసారి జనాలకు చిరాకు తెప్పిస్తుంటాయి. మరోసారి అర్ధం కాకుండా ఉంటాయి.
ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటుగా ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో కాని..ఇతర విషయాల్లో ఏదైనా జరిగితే.. వర్మ స్పందన కోసం ఎదరు చూస్తుటారు కొందరు. ఆయన ఏ రకంగా స్పందిస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక తాజాగా ఆయన పద్మ విభూషణ్ అవార్డులపై తనదైన శైలిలో స్పందించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి తదితరులను పద్మ విభూషణ్ పురస్కారాలు వరించిన సంగతి తెలిసిందే.
ఇదే అంశంపై తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు.. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి విషెష్ చెబుతున్నారు. చాలామంది మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో చిన్న నటుల నుంచి పెద్ద నటుల వరకు... అందరూ హర్షం వ్యక్తం చేశారు. మోహన్ బాబు సైతం ఆనందం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పద్మ విభూషణ్ పురస్కారాలపై పెదవి విరిచారు. పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాథక్ వంటి వాళ్ల గురించి తాను ఎప్పుడూ వినలేదని... వాళ్లు మెగాస్టార్ చిరంజీవితో సమానంగా నిలవడం తనకు థ్రిల్ కలిగించలేదని అన్నారు. ఒకవేళ చిరంజీవి గారు ఈ విషయంలో సంతోషంగా ఉంటే... తాను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తానని చెప్పారు.
వర్మ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నెటిజన్లు ఆర్జీవీపై మండిపడుతున్నారు. నీ బాధేంటి.. ప్రశంసించడం నేర్చుకో, నీకు ఎందుకు ఎవరూ అవార్డ్ ఇవ్వడం లేదు మరి అంటూ కామెంట్స్ పెడుతూ ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.