అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలలో రామ్ గోపాల్ వర్మ ప్రస్టేజియస్ గా తీసుకుని తెరకెక్కించిన మూవీ డేంజరస్. ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడంతో వచ్చిన రకరకాల విమర్షలకు చిన్న వీడియో ద్వారా సమాధానం చెప్పారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 

అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలలో రామ్ గోపాల్ వర్మ ప్రస్టేజియస్ గా తీసుకుని తెరకెక్కించిన మూవీ డేంజరస్. ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడంతో వచ్చిన రకరకాల విమర్షలకు చిన్న వీడియో ద్వారా సమాధానం చెప్పారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 

 ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ప్రేమ కాన్సెప్ట్ తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా డేంజరస్. దేశంలోనే మొదటి లెస్బియన్ సినిమాగా ఈసినిమాను వర్మ ప్రమోట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఐదు ప్రధాన భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి వరకూ వర్మ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ప్రమోషన్స్ చేశాడు. అన్ని సిటీస్ కు హీరోయిన్స్ తో పాటు వెళ్లి ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించారు వర్మ.

ఇక ఈరోజు (ఏప్రిల్ 8) గ్రాండ్ రిలీజ్ కావల్సిన డేంజరస్ మూవీకి సినిమా థియేటర్లు షాక్ ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద థియేటర్స్ నెట్ వర్క్స్ అయిన పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తమ థియేటర్స్ లో డేంజరస్ రిలీజ్ కుదరదంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సదరు సంస్థలను వర్మ ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా సరే వినకపోవడంతో సినిమాను వర్మ వాయిదా వేసుకోక తప్పలేదు. 

ఇక ఈ సినిమాకు సంబంధించి, నిర్మాత నట్టికుమార్ తనపై చేసిన ఆరోపణలపై కూడా రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. నట్టి కుమార్ నోటీసులకు తన అడ్వకేట్ సమాధానమిస్తారని చెప్పారు. తనపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు సమాధానం ఎలా చెప్పాలో తనకు తెలుసని అన్నారు. ఇండస్ట్రీలో ఎవరిమీదో ఒకరి మీద ఆరోపణలు చేయడం నట్టికి అలవాటేనని,ఆయనేంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని అన్నారు. ఇక గతంలో చిరంజీవి, సురేశ్‌బాబు మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని అన్నారు వర్మ.

Scroll to load tweet…

ఇక మా ఇష్టం రిలీజ్ వాయిదాకు కారణం నిర్మాత నట్టికుమార్ కారణం కాదని, వేరే కారణం ఉందన్నారు రామ్ గోపాల్ వర్మ. లెస్బియన్ కథతో రూపొందిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు చాలా థియేటర్లు ముందుకు రావడం లేదని, దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. నట్టి కుమార్‌కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కాబట్టి ఆయన గురించి ఇకపై ఎక్కడా మాట్లాడనని పేర్కొన్నారు. చట్ట పరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని తన అడ్వకేట్ చూసుకుంటారని ఆర్జీవీ వివరించారు.