మొన్నా మధ్య పవన్ కళ్యాణ్ ని, మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేసిన వర్మ ఇప్పుడు పవన్ ని ముఖ్యమంత్రి చూడాలని ఉందంటూ కామెంట్ చేశాడు. పాజిటివ్ గా మాట్లాడితే వర్మ ఎందుకు అవుతాడు..? పవన్ పై అలాంటి కామెంట్ చేసిన మాట నిజమే కానీ అది వెటకారంగా చేశారు.

పవన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుందని, ఇంతకముందు పవన్ ని చూడాలంటె సినిమా పేజీ వరకు వెళ్లేవాళ్లం.. పవన్ ముఖ్యమంత్రి అయితే మొదటి పేజీలోనే చూడొచ్చు.. ఓ అందమైన ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకోగలరు అంటూ సెటైర్ వేశారు.

అలానే కేఏ పాల్ ని కూడా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. అదెందుకని ప్రశ్నిస్తే.. 'ఇది వరకు కామెడీ సినిమా కోసం థియేటర్ కి వెళ్లేవాళ్లం. పాల్ ముఖ్యమంత్రి అయితే ఆ అవసరం ఉండదు' అంటూ కామెడీ చేశాడు.

ప్రస్తుతం వర్మ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వర్మ సరికొత్త స్ట్రాటజీలు ఫాలో అవుతున్నాడు.