మరో వివాదాస్పద టాపిక్ ని తన సిరీస్ కోసం ఎంచుకున్నాడు వర్మ. సాధారణంగా సొసైటీ లో కనిపించే వివిధ రకాల మస్తత్వాలు కలిగిన భార్యల సమాహారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు.  

విషయం ఏదైనా వర్మ నోటి నుండి వస్తే సంచలనమే. ప్రతి టాపిక్ కి తన మార్కు వివాదం జోడించడం ఆయన తెలిసిన గొప్ప విద్య. తాజాగా మరో వివాదాస్పద టాపిక్ ని తన సిరీస్ కోసం ఎంచుకున్నాడు వర్మ. సాధారణంగా సొసైటీ లో కనిపించే వివిధ రకాల మస్తత్వాలు కలిగిన భార్యల సమాహారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. 


ఒక మగవాడి జీవితం తనకు దొరికిన భార్య నేచర్ పై ఆధారపడి ఉంటుందని వర్మ అంటున్నాడు. ఎలాంటి భార్యతో భర్త ఎలాంటి నరకం అనుభవిస్తారో చూపిస్తానని అంటున్నారు. దీని కోసం ఎనిమిది రకాల తత్వాలను వర్మ ఎంచుకున్నాడు. ఏడుపుగొట్టు, ఎప్పుడూ దెబ్బలాడే, మొబైల్ ప్రపంచంగా బ్రతికే, అనుమానపు, పిసినారి, ముక్కు మీద కోపం, మొగుడ్ని చెప్పు చేతల్లో పెట్టుకునే అనే ఎనిమిది లక్షణాలకు కలిగిన భార్యల కథలతో ఎనిమిది ఎపిసోడ్ లో తెరకెక్కించనున్నట్లు తెలియజేశాడు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో నేచర్ కలిగిన భార్యతో భర్త పడే కష్టాలు చూపిస్తాడట. 

ఇక ఈ సిరీస్ కోసం ఇటీవల 30 వెడ్స్ 21 సిరీస్ తో మంచి పాపులారిటీ రాబట్టిన చైత్యన రావ్ ని ఎంచుకున్నాడు. వర్మ భార్యలపై తెరకెక్కించే ఈ సిరీస్ తరువాత రకరకాల భర్తలు పేరుతో మరో సిరీస్ తెరకెక్కిస్తాడట. మరి వర్మ ఈ రెండు సిరీస్ లు ఎన్ని వివాదాలు రాజేయనున్నాయో చూడాలి. 


YouTube video player