యువ హీరో రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  షూటింగ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తోన్న ఈ హీరో ఇటీవల ఊహించని విమర్శలు ఎదుర్కొన్నాడు. రామ్ చార్మినార్ దగ్గర సిగరెట్ కాల్చి పోలీసులకు 200 ఫైన్ కట్టిన విషయం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

అయితే రామ్ బ్రేక్ లో పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేసినట్లు  ట్రోల్స్ డోస్ ఎక్కువవ్వడంతో హీరో రామ్ స్పందించక తప్పలేదు. చట్టానికి గౌరవం ఇచ్చి ఫైన్ కట్టినట్లు ఇస్మార్ట్ శంకర్ స్టైల్ లోనే ఆన్సర్ ఇచ్చాడు.  

'నా టైమ్ పబ్లిక్ టైమ్ వెస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ కాలేదు. షాట్ ల కాల్చిన తమ్మి. బ్రేక్ ల కాదు. టైటిల్ సాంగ్ లా చూస్తావ్ గా స్టెప్పు. లా(చట్టానికి) ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గిప్పుడు నువ్వు కూడా నా లెక్క లైట్ తీస్కో పని చూస్కో' అంటూ రామ్ పేర్కొన్నాడు.