రామ్ చరణ్ తో విశ్వక్ సేన్.. వైరల్ అవుతున్న పోటో..

ఒక ఇద్దరు స్టార్లు ఒక చోట చేరితే అది వైరల్ న్యూస్ కాకుండా ఉంటుందా..? ఫ్యాన్స్  పండగ చేసుకోకుండా ఉంటారా..? తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Ram Charan with Vishwak Sen Photo Viral In Social Media JMS

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఈ ఇద్దరు హీరోలు ఇక చోట కలిస్తే..? ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఎలా ఉంటుంది. తాజాగా ఈ సందర్భం వచ్చింది. ఈ ఇద్దరు తారలు కలిసి సందడిచేయడంతో.. సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇద్దరు ఎక్కడ.. ఎప్పుడు కలిశారంటే..? 

రీసెంట్ గా ఓ స్టార్ బిజినెస్ మెన్ కు సబంధించిన  క్లబ్ ఓపెనింగ్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ తారాతోరణం కదిలి వచ్చింది. అందులో  వెంకటేష్, మహేష్ బాబు.. మహేష్, చరణ్ ఫ్యామిలీలు సందడి చేసిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి..  కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే బయటకి వచ్చి వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు వేసుకున్న లక్షరూపాయల టీ షర్ట్ కూడా హైలెట్ అయ్యింది. తాజాగా మరో ఫోటో ఈ ఈవెంట్ నుంచి వైరల్ అవుతోంది. 

 

ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ కూడా సందడి చేయగా.. రామ్ చరణ్ తో టాలీవుడ్ మాస్ కా దాస్  విశ్వక్ సేన్ దిగిన ఫొటో బయటకి వచ్చింది. విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫొటో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే విశ్వక్  సేన్ పై ఇప్పటి వరకూ నందమూరి ముద్ర ఉంది. ఆ హీరోలను ఎక్కువగా అభిమానిస్తాను అను చెప్పుకుంటాడు యంగ్ హీరో. ఇలాంటి టైంలో రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫొటో షేర్ చేయడంతో మెగా అభిమానులు కూడా సంతోషిస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన బుచ్చిబాబు సానతో .. పాన్ ఇండియా సినిమాలోకి వెళ్ళబోతున్నాడు.. ఇక విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. తన మార్క్ సినిమాలతో టాలీవుడ్ లో కొత్త ఇమేజ్ నుసాధించాడు విశ్వక్. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios