రామ్ చరణ్ కుటుంబంలో విషాదం... ఉపాసన గ్రాండ్ మదర్ కన్నుమూత!
రామ్ చరణ్ సతీమణి ఉపాసన గ్రాండ్ మదర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన ఒక ఎమోషనల్ నోట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

ఆ మధ్య ఉపాసన తాతగారు మరణించారు. దోమకొండ సంస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. నేడు గ్రాండ్ మదర్ మరణించారు. ఉపాసన దోమకొండ సంస్థాన వారసురాలు. ఆ సంస్థాన వారసులైన కామినేని కుటుంబం విద్యావంతులుగా ఎదిగి మెడికల్ సామ్రాజ్యం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అపోలో బ్రాండ్ పేరున అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. ఫార్మా కంపెనీలు నెలకొల్పారు. ఉపాసన అపోలో గ్రూప్ చైర్ పర్సన్ గా ఉన్నారు.
ఆ మధ్య ఉపాసన తాతగారు మరణించారు. దోమకొండ సంస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. నేడు గ్రాండ్ మదర్ మరణించారు. ఉపాసన దోమకొండ సంస్థాన వారసురాలు. ఆ సంస్థాన వారసులైన కామినేని కుటుంబం విద్యావంతులుగా ఎదిగి మెడికల్ సామ్రాజ్యం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అపోలో బ్రాండ్ పేరున అనేక హాస్పిటల్ ఉన్నాయి. ఫార్మా కంపెనీలు నెలకొల్పారు. ఉపాసన అపోలో గ్రూప్ చైర్ పర్సన్ గా ఉన్నారు.
ఉపాసనను రామ్ చరణ్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది ఉపాసన గర్భం దాల్చారు. ఈ ఏడాది మెగా కుటుంబంలోకి వారసుడు రానున్నాడు. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుండో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నట వారసత్వం ముందుకు తీసుకెళ్లే వారసుడు దిగాలని కోరుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రం చేస్తున్నాడు.