ఆస్కార్ అవార్డ్స్ వేడుక కోసం అమెరికా చేరిన రామ్ చరణ్ .. ఉపాసనతో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడు.ఇద్దరూకలిసి బేబీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమెమరీస్ ను ఫ్యాన్స్ కు శేర్ చేస్తున్నారు.
ఆస్కార్ వేడుకలు, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం ముందుగానే అమెరికాచేరిన రామ్ చరణ్.. ఆ పనులకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.తల్లి కాబోతున్న తన భార్యకు టైమ్ కేటాయించాడు. ఉపాసనతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ.. చెట్టా పట్టాలు వేసుకుని అమెరికా అంతా తిరిగేస్తున్నాడు. షాపింగ్స్, డిన్నర్స్.. అంటూ తెగ తిరిగేస్తున్నారు మెగా జంట. ఈ బేబీమూన్ ట్రిప్ కుసబంధించిన వీడియో సోషల్ మీడియాలో శేర్ చేయగా.. అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియో చూసి దిల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
రామ్ చరణ్ ఉపాసనను మహారాణిలా చూసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి ఓపెన్ టాప్ కారులో షికారుకెళ్ళడం. ఆ కారును రామ్ చరణ్ స్వయంగా డ్రైవ్ చేయడం. షాపింగ్ చేసిన తరువాత ఉపాసన దర్జాగా ముందు నడుస్తుంటే.. సామాన్లు మోస్తూ.. రామ చరణ్ వెనుక నగడవడం, ఇక ఇద్దరూ.. కలిసి డిన్నర్లు, సైట్ సీయింగ్ ఇలా ఎన్నో..వారిద్దరు కలిసి గడిపిన క్షణాలు కెమెరాలో బంధించి.. వాటిని ఒక వీడియోగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో శేర్ చేసింది జంట. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో టైమ్ తెలియకుండా బిజీగా ఉన్న రామ్ చరణ్. తన భార్య కోసం ఇలా టైమ్ కేటాయించడం మెగా ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.
ఇక ట్రిపుల్ ఆర్ విషయానికి వస్తే.. ఈ మూవీ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్ నుసొంతం చేసుకుది. ముఖ్యంగా 5 హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ లను, ఆస్కార్ తరువాత అంతటి అవార్డ్ గొల్గెన్ గ్గొబ్ ను సాధించింది. ఈక్రమంలో ఓరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఈనెల 12న ఆస్కార్ ఈవెంట్స్ గ్రాంగ్ గా జరగనున్నాయి. ఈ ఈవెంట్ లో నాటు నాటు పాటను లైవ్ లో వినిపించబోతున్నారు. ఇక ఆస్కార్ ప్రమోషన్స్ కోసం చాలా కాలంగా రాజమౌళీ విదేశాల్లోనే ఉంటున్నారు. అక్కడ ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ వేస్తూ...హాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ దూసుకుపోయేలా చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు అందాయి. దిగ్గజ దర్శకులు అవతార్ ఫేమ్ జేమ్స్ కామరాన్ లాంటివారు ఈసినిమా అద్భుతం అంటూ రాజమౌళితో మాట మంతీ చేయడం. రామ్ చరణ్ నటనను కీర్తించడం టాలీవుడ్ కు దక్కిన గొప్ప గౌరవం. ఇక ఈక్రమంలోనే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ గ్యారంటీ అంటున్నారు. మరి చూడాలి... ఆస్కార్ సందడి.. టాలీవుడ్ కీర్తి.. హాలీవుడ్ కు ఎగబాకుతుందా..?
