రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.  ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్  ఆర్ఎఫ్సీలో జ‌రుగుతుంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ పై రాని విధంగా ఓ ఫైట్ సీక్వెన్స్ ని రీసెంట్ గా తెరకెక్కించారట. దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్ట్ లను ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం తీసుకొచ్చారట. వారందరితో రామ్ చరణ్ ఫైట్ చేయటం తెరపై చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందంటున్నారు.

ఇంతకీ ఆ సీన్ ఏమిటి..ఏ సందర్బంలో వస్తుందనేది ఇప్పుడు సినిమా జనాల్లో ఆసక్తిగా మారింది. జనం చెప్పుకుంటున్న దాని ప్రకారం... రామ్ చరణ్ పాత్ర ..బ్రిటీషర్స్ దగ్గర పనిచేసే ఓ పోలీస్ అధికారి. అవి స్వాతంత్ర్యం జరుగుతున్న రోజులు. దాంతో ఓ పోలీస్ స్టేషన్ పై  చుట్టుప్రక్కల ఊళ్లలో ఉండే ఓ స్వాతంత్ర సమర యోధుల గుంపు దాడి చేస్తుంది. వారంతా ఒక్కసారిగా విరుచుకుపడతారు. 

అయితే ఈ విషయం ముందుగా రామ్ చరణ్ కు తెలియదు . చివరి నిముషాల్లో వచ్చి వారిపై ఎటాక్ చేస్తారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ స్వాతంత్ర్య సమర యోధులకు అతనే అండగా నిలుస్తాడు.  అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. 

#RRR షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది.  గత కొద్ది రోజులుగా రాజమౌళి ఒక భారీ యాక్షన్ సీక్వెన్సును చరణ్.. ఇతర ఫైటర్లపై తెరకెక్కిస్తున్నారు.  ఈ ఎపిసోడ్ చరణ్ కు సంబంధించినది కావడంతో ఎన్టీఆర్ కు మాత్రం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారని సమాచారం.