మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. స్టార్ సెలబ్రిటీలు మెగాస్టార్ కు ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు చెపుతున్నారు. ఇక తాజగా మొదటి సారి చిరంజీవి తన మనవరాలితో దిగిన ఫోటో వైరట్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో మెగాస్టార్ కు అల్లు అర్జున్, ఎన్టీఆర్, తో పాటు మెగా హీరోలు అందరూ.. ఆయనకు విష్ చేశారు. చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మెగాస్టార్ కు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా బర్త్ డే విషెష్ తెలిపాడు. అయితే అందరిలా కాకుండా స్పెషల్ గా మెగాస్టార్ కు విషెష్ తెలిపారు మెగా పవర్ స్లార్ రామ్ చరణ్. చరణ్ తన కూతురు క్లింకారని చిరంజీవి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ. బర్త్ డే విష్ చెప్పారు.
టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా మెగాస్టార్ కి విషెష్ చెప్తున్నారు.తాజాగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా తన తండ్రికి కి బర్త్ డే విషెష్ తెలిపాడు. అయితే స్పెషల్ గా రామ్ చరణ్ కూతురు క్లింకారని చిరంజీవి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే చిరుత అంటే చిరంజీవి తాత అంటూ పోస్ట్ చేశారు. . మా ఇంట్లో లిటిల్ మెంబర్ నుంచి చిరంజీవికి ప్రేమతో శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు చరణ్.
అయితే మెగాస్టార్ తన మనవరాలితో కలిసి బయటకు వచ్చిన మొదటి పోటో కావడంతో.. మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. దీంతో చిరంజీవి క్లింకారని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడిమాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. మెగా అభిమానుల దగ్గర నుంచి.. స్టార్ సెలబ్రిటీల వరకూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ పోటీ పడ్డారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ ను డిఫరెంట్ స్టైల్లో విష్ చేశారు.. చేస్తూనే ఉన్నారు.
