‘ఉప్పెన’ సినిమా చేసిన బుచ్చిబాబు నన్ను కలవాలని కోరాడు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని శివరాజ్ కుమార్ అన్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం


 కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ రీసెంట్ గా చేసిన తమిళ సినిమా ‘జైలర్’పెద్ద హిట్టైంది. ఆ సినిమాలో క్యామియో రోల్ చేసిన తర్వాత శివన్నకు ఇతర భాషల్లో డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమాలో నటించిన శివన్న.. రామ్ చరణ్ తో కొత్త సినిమాలో నటించనున్నారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగినట్లు చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని తెలుస్తోంది. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అని ప్రచారం జరిగింది. 

రామ్ చరణ్ సినిమాలో శివన్న స్పెషల్ రోల్ చేస్తున్నారని వస్తున్న వార్తలు వైరల్ అవుతుండటంతో శివన్న ఈ విషయంపై స్పందించారు.
దీని పై శివన్న మాట్లాడుతూ.. రామ్ చరణ్ సినిమా గురించి ఇంకా ఏమీ చెప్పాలను..దీని గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ నేను దీని పై మాట్లాడలేను. ఇప్పుడే మాట్లాడి ఆ సినిమా చేయకపోతే అభిమానులు నిరాశపడతారు. ‘ఉప్పెన’ సినిమా చేసిన బుచ్చిబాబు నన్ను కలవాలని కోరాడు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని శివరాజ్ కుమార్ అన్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ఈ సినిమాలో రామ్ చరణ్ కు మెంటర్ గా ...ఓ స్పోర్ట్స్ లో గురువు లాంటి పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారని అంటున్నారు. ఆయన పాయింటాఫ్ వ్యూలోనే ఫ్లాష్ బ్యాక్ లో కథ ఓపెన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

"రామ్ చరణ్ తో మీ స్నేహ సంబంధాలు ఎలాంటివి? రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది?" అని ప్రశ్నించారు. అందుకు శివరాజ్ కుమార్ స్పందించారు. "రామ్ చరణ్ ఓ వ్యక్తిగా మేలిమి వజ్రం లాంటి వాడు. ఓ నటుడిగా అతడు అమోఘం. ప్రపంచవ్యాప్తంగా ఆదరాభిమానాలు పొందుతున్నప్పటికీ ఎంతో వినయవిధేయతలతో నడుచుకుంటాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటన అద్భుతం... కానీ అతడి చిత్రాల్లో మగధీర నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చుతుంది" అని వివరించారు.