Asianet News TeluguAsianet News Telugu

లాజిక్ లేకుండా బురదజల్లే ప్రయత్నం.. రాంచరణ్ సీరియస్ ?

మెగా ఫ్యామిలీ గురించి ఏదో ఒక అనవసరమైన వార్త మీడియాలో రావడం..దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుండడంతో రాంచరణ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

Ram Charan serious on latest rumours that Chiranjeevi will start international school
Author
Hyderabad, First Published May 14, 2019, 11:56 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ బిజినెస్ ప్రారంభించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అవాస్తవం అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మెగా ఫ్యామిలీ గురించి ఏదో ఒక అనవసరమైన వార్త మీడియాలో రావడం..దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుండడంతో రాంచరణ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

శ్రీకాకుళం జిల్లాలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నాడని.. ఆ విద్యాసంస్థ బాధ్యతలని నాగబాబు, రాంచరణ్ నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ పీఆర్ టీం అధికారికంగా స్పందించింది. చిరంజీవి గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని తేల్చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాలనే ఆలోచన మెగా అభిమానులది. దీనితో చిరంజీవి, మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. 

దీనిని ఆధారంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థల్లో చిరుకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. డబ్బు దాహంతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా వ్యాపారం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాంచరణ్ కు ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. డబ్బే ముఖ్యం అనుకుంటే కోట్లలో ఆదాయం వచ్చే ఇంకా మెరుగైన వ్యాపారాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ని, అది కూడా వెనుకబడిన శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్రారంభిస్తాం అని చరణ్ సన్నిహితుల వద్ద అన్నాడట. కనీసం ఈ లాజిక్ కూడా లేకుండా అసత్య కథనాలు ఎలా ప్రచారం చేస్తారు అని రాంచరణ్ సీరియస్ అయ్యాడట. రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, చిరంజీవి సైరా చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios