సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉండే రామ్ చరణ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించాడు.

సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉండే రామ్ చరణ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించాడు. @alwaysramcharan అనే ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ని ఓపెన్ చేశారు. ఆయన ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే ఫాలోవర్ల సంఖ్య నాలుగు లక్షల వరకు చేరింది.

ఈ అకౌంట్ ద్వారా శుక్రవారం ఉదయం తొలి పోస్ట్ చేస్తానని ఇటీవల ఓ వీడియో ద్వారా రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగా కాసేపటి క్రితం చరణ్ తన తొలి పోస్ట్ పెట్టాడు. అయితే తన పోస్ట్ ని ఎంతగానో ప్రేమించే తన తల్లికి డెడికేట్ చేశాడు.

చిన్నప్పుడు తన తల్లితో కలిసి తీయించుకున్న ఫోటోను, ఇటీవల ఫోటోని కలిపి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ''కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.. నా తొలి పోస్ట్ నీకే అంకితం.. లవ్యూ అమ్మా'' అంటూ క్యాప్షన్ పెట్టాడు.

అందరూ చరణ్ తన తొలి పోస్ట్ 'సై రా' సినిమా గురించి చేస్తాడని అనుకున్నారు. కానీ చరణ్ తన తల్లి గురించి పోస్ట్ చేయడానికి నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు. 

View post on Instagram