రామ్ చ‌ర‌ణ్ – మెహ‌ర్ ర‌మేష్ లు క‌లిసి ఓ ప్రాజెక్టు చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం.. మెగా అభిమానుల‌కు షాకింగ్ గా మారింది.  అసలు కొద్ది కాలం క్రిందట చిరు – మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో ఓసినిమా వ‌స్తుంద‌ని ఆ మ‌ధ్య బాగా ప్ర‌చారం సాగింది. `నా కోసం మెహ‌ర్ ర‌మేష్ ఓ క‌థ రెడీ చేస్తున్నాడు` అంటూ చిరు కూడా ఆమ‌ధ్య చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కాంబినేషన్ చ‌ర‌ణ్ – మెహ‌ర్ ల‌కు షిఫ్ట్ అయ్యిందని ఇప్పుడు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో రామ్ చరణ్ రిస్క్ చేసి మెహర్ రమేష్ కి సినిమా ఇవ్వరు. ఆ విషయం మెహర్ కు స్పష్టంగా తెలుసు. అయితే మొదట ఓ వెబ్ సీరిస్ అప్పచెప్తున్నారట. దాన్ని సక్సెస్ చేస్తే చెర్రీ తనతో సినిమా చూద్దాం అన్నారట. అంటే ఇప్పుడు మెహర్ కు ఇది పెద్ద టెస్ట్ అన్నమాట. పాసవుతాడా లేదా అన్నది చూడాలి. 

ఇక ఇప్పుడు మెహర్ రమేష్ ...అదిరిపోయే వెబ్ సీరిస్ కోసం కథని తన టీమ్ తో రెడీ చేయిస్తున్నారట. దాన్ని చ‌ర‌ణ్, లేదా సుస్మిత నిర్మాత‌లుగా ప‌ట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. అలాగే ఆహాలో ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ కానుంది.  త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. మెహర్ రమేష్ ...షాడో సినిమా తర్వాత ఏ సినిమా కూడా చెయ్యలేదు. దాంతో ఇప్పుడు ఈ వెబ్ సీరిస్ ...అతని స్కిల్ కు పెద్ద పరీక్షగా మారే అవకాసం ఉంది. బయిట కొత్త నీరు ప్రవహిస్తోంది. ఎక్కడెక్కడి కుర్రాళ్లు వెబ్ సీరిస్ లపై పడి తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. మరి మెహర్ రమేష్ వాళ్లను దాటుకుని ముందుకు వెళ్తాడా అనేది పెద్ద ప్రశ్నే. అయితే వెబ్ సీరిస్ కాబట్టి పెద్దగా నష్టాలు వంటివి ఉండవు. బాగుంటే లాభాలు పంట. 
 
ఇక కెరీర్ ప్రారంభంలో స్టైలిష్ అండ్ కాస్ట్లీ డైరెక్టర్‌గా పేరొందిన మెహర్ రమేష్.. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పెద్ద హీరోలు అతని స్టైలిష్ మేకింగ్ కు టెమ్ట్ అయ్యి ఆఫర్స్ ఇచ్చారు. కానీ మెహర్ రమేష్ వాటిని  హిట్ లుగా మలుచుకోలేకపోయారు.  షాడో సినిమా తరువాత మహేష్ సినిమాలకు దూరంగానే ఉంటూ.. మహేష్ బాబు క్యాంప్ లో ఉంటూ ఆ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్ క్యాంప్ లో ప్రవేశించి వెబ్ సీరిస్ పట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.