విక్రమ్ సక్సెస్ ప్రభావం... లోకేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్, నిజమెంత...?
కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ తో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. స్టార్ హీరోలతో సినిమాల ప్రపోజల్స్ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఇక లోకేష్ తో సినిమాకు ఇటు మెగా పవర్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ తో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. స్టార్ హీరోలతో సినిమాల ప్రపోజల్స్ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఇక లోకేష్ తో సినిమాకు ఇటు మెగా పవర్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
విక్రమ్ సినిమాతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కమల్ హాసన్ తో సినిమా చేయడం. అది కూడా ఆయనకు చాలా కాలం తరువాత ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతొ... లోకేష్ కు డిమాండ్ పెరిగిపోయింది. కమల్ హాసన్ ను కొత్తగా చూపించి.. కమల్ తో యాక్షన్ మూవీతో చేయడంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యాడు. ఇక దాంతో లోకేష్ ను పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్- రామ్ చరణ్ కాంబినేష్ తెరపైకి వచ్చింది.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని కనిపించనుంది. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చరణ్ చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో రామ్ చరణ్ కు లోకేష్ ఓ కథను వినిపించాడట. అయితే కథ నచ్చింది కాని డైరెక్టర్ ను ఓల్డ్ లో పెట్టాడని టాక్. అయితే టాలీవుడ్ లో తనకి బాగా పరిచయం ఉన్న హీరో చరణ్ అనీ .. ఆయనకి ఒక కథను కూడా వినిపించానని లోకేశ్ కనగరాజ్ కొన్ని రోజుల క్రితం చెప్పాడు. అది ఇప్పుడు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.
ఇంకొక విషయం ఏంటీ అంటే.. మైత్రీ బ్యానర్ వారితో లోకేష్ కనగరాజ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అయిదే అది రామ్ చరణ్ తో ఓకే అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమా చరణ్ తోనే ఉండనుందని అంటున్నారు. దాదాపు ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు. ఇక రీసెంట్ గా విక్రమ్ సినిమా సక్సెస్ సందర్భంగా కమల్ తో పాటు లోకేశ్ కనగరాజ్ ను కూడా చిరంజీవి పిలిచి మరీ సత్కరించి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడే ఈ సినిమాకు సంబధించి చర్చలు జరిగినట్టు సమాచారం. గతంలో వరుసగా దళపతి విజయ్ తో సినిమాలు చేసిన లోకేశ్ కనగరాజ్ .. ప్రస్తుతం విజయ్ తో మరో సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు.