క్రేజీ న్యూస్.. రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ లో రామ్ చరణ్, బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ నిజమేనా..?
గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ .. రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ ను లైన్ లో పెట్టాడు మెగా పవర్ స్టార్.. తాజాగా ఆయన బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?

గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ .. రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ ను లైన్ లో పెట్టాడు మెగా పవర్ స్టార్.. తాజాగా ఆయన బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో బాలీవుడ్ చూపు ఆయనపైపు పడింది. అటు ఓ వైపు గేమ్ చేంజర్ షూటింగ్‌లో జోరుగా పాల్గొంటూ.. మరోవైపు బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా కోసం ముస్తాబవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.
గ్లోబల్ ఇమేజ్ వల్ల తను చేయబోయే సినిమాలన్ని హై స్టాండడ్స్‌లో ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్‌చరణ్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన చరణ్‌ను రాజ్‌కుమార్ హిరానీ కలిసాడని, ఓ కథను కూడా నెరేట్ చేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారాలు పుట్టుకొచ్చాయి.
ఇందులో నిజం ఎంతన్నదో తెలియదు కాని.. రామ్‌చరణ్‌తో రాజ్ కుమార్ హిరాని సినిమా సీక్రేట్ గా పని జరుగుతుంది అని టాక్. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అంత ఆశామాశ కాదు. రాజ్ కుమార్ రెండు మూడేళ్లకు సినిమా చేస్తుంటాడు. అది కూడా ఇండస్ట్రీ హిట్ పక్కాగా తీస్తుంటాడు. 20ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన తీసినవి ఐదు సినిమాలే అంటే.. రాజ్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఏంటో అర్ధం అవుతుంది.
ఇక ప్రస్తుతం రాజ్ కుమార్ ఆరో సినిమాగా డంకీ మూవీ తెరకెక్కతుంది. మరి ఈయన వెంటనే రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా.. ఇంత త్వరగా స్క్రిప్ట్ రెడీ అవుతుందా అని డౌట్. కాని రామ్ చరణ్ సినిమాలు అయిపోయే సరి రెండు మూడేళ్ల పట్టే అవకాశం ఉంది. దాంతో చరణ్ సినిమా మూడేళ్ళ తరువాత వీరి కాబోలో సినిమా ఉండే అవకాశం ఉంది అంటున్నారు.