రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `ఆర్‌సీ15` సినిమాకి సంబంధించి, చెర్రీ నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి.

`ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) తర్వాత రామ్‌చరణ్‌(Ram Charan) క్రేజ్ బాగా పెరిగింది. పాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆయన కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ క్రేజ్‌, ఉత్సాహంతో భారీ సినిమాలు చేస్తున్నారు చరణ్. ప్రస్తుతం ఆయన పాన్‌ ఇండియా డైరెక్టర్‌ శంకర్‌(Shankar)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `RC15` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని శంకర్‌ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో చెర్రీకి జోడీగా కియారా అద్వానీ(Kiara Advani) కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌గా కనిపిస్తారని టాక్‌. ఇప్పటికే పలు పిక్స్ లీక్‌ అయి వైరల్‌ అయ్యాయి. 

ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ బజ్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో చరణ్‌కి తల్లిగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి నటించబోతుందట. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) తల్లి నీతూ కపూర్‌(Neetu Kapoor).. చరణ్‌కి మదర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. తల్లి పాత్ర కోసం నీతూ కపూర్‌ని శంకర్‌ అప్రోచ్‌ అయ్యారని, ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌ మరోసారి బాలీవుడ్‌లో నటించబోతున్నారట. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో ఆయన గెస్ట్ రోల్‌ చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు చరణ్‌ నెక్ట్స్ గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నారు. అలాగే `విక్రమ్‌` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉందని సమాచారం.