రాంచరణ్ ఇండియా నుంచి న్యూయార్క్ వెళ్ళేటప్పుడు స్వామి మాలలో ఉన్నారు. పాదరక్షలు లేకుండా చరణ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం యుఎస్ లో సందడి చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్స్ కి నామినేషన్స్ లో నిలిచింది. మార్చి 12న 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాంచరణ్ అమెరికా చేరుకున్నారు. ఫేమస్ అమెరికన్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కింది.
గుడ్ మార్నింగ్ అమెరికా అనేది బిగ్గెస్ట్ పాపులర్ షో. ఈ షోలో చరణ్ కి పాల్గొనే అవకాశం రావడంతో ఫ్యాన్స్ అంతా సంబరాల్లో ఉన్నారు. అయితే రాంచరణ్ ఇండియా నుంచి న్యూయార్క్ వెళ్ళేటప్పుడు స్వామి మాలలో ఉన్నారు. పాదరక్షలు లేకుండా చరణ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
కానీ యుఎస్ వెళ్ళాక రాంచరణ్ మోడ్రన్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో కూడా చరణ్ స్టైలిష్ గా సూటు బూటు ధరించి కనిపించాడు. అదేంటి అంటూ ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది.
దీనిపై రాంచరణ్ పిఆర్ టీం వివరణ ఇచ్చింది. రాంచరణ్ మాలలో 21 రోజుల దీక్ష పూర్తయిందట. దీక్ష పూర్తయిన తర్వాతే రాంచరణ్ అమెరికాలోని ఆలయంలో మాల తీసేసినట్లు చెబుతున్నారు. అసలు విషయం తెలియడంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామి దీక్ష పూర్తి కావడం, వెంటనే ఆస్కార్ ప్రమోషన్స్ లో పాల్గొనడం వెంటవెంటనే జరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాంచరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
