సారాంశం


ఈ సినిమా విడుదల తేదీ కోసం చరణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు చిత్ర బృందం ఆ అప్‌డేట్‌ ఇవ్వలేదు. 


రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో వైరల్‌గా మారింది. దీంతో చెర్రీ  ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  గేమ్ చేంజర్ వీలైనంత తొందరగా పూర్తి చేసి 2024 దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్. ఒకవేళ ఆ పండగ సీజన్ అందుకోకపోతే 2025 సంక్రాంతికి ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలి అని దిల్ రాజు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దాంతో దసరా సీజన్ కు స్లాట్ ఖాళీ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.  అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. 
 
స్టార్ డైరక్టర్ శంకర్‌ (S Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ గ్యాప్ తర్వాత ఇటీవలే ప్రారంభమైనట్లు సమాచారం. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. రాజకీయ అంశాలతో నిండిన యాక్షన్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.  
 
అలాగే రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. RRR మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యిన ఈ  మెగా పవర్ స్టార్ ఈ చిత్రం తర్వాత   చేస్తున్న మూవీ "గేమ్ ఛేంజర్". భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన  శంకర్  ఈ చిత్రం..అంతకు మించి అనే స్దాయిలో రూపొందిస్తున్నాడని వినికిడి.  పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.   రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.