Asianet News TeluguAsianet News Telugu

#GameChanger ‘గేమ్‌ ఛేంజర్‌’ ఓవర్ సీస్ డీల్ రచ్చ, అసలు నిజం ఏమిటి?

రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. 

Ram Charan #GameChanger Overseas One Of Lowest Deal In South India Recently? jsp
Author
First Published Jan 30, 2024, 6:15 AM IST | Last Updated Jan 30, 2024, 6:15 AM IST

రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్నారు.  రాజమౌళితో చేసిన RRR మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యిన ఈ  మెగా పవర్ స్టార్ ఈ చిత్రం తర్వాత   చేస్తున్న మూవీ "గేమ్ ఛేంజర్". భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన  శంకర్  ఈ చిత్రం..అంతకు మించి అనే స్దాయిలో రూపొందిస్తున్నాడని వినికిడి.  పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.   రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.  ఈ ప్రాజెక్టు పై ఉన్న క్రేజ్ తో  ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమై జరుగుతున్నట్లు సమాచారం. అయితే  ఈ చిత్రం ఓవర్ సీస్ డీల్ గతంలోనే  క్లోజ్ చేసారట.అయితే దేవర ఓవర్ సీస్ రైట్స్ మేటర్ బయిటకు రావటంతో ఫ్యాన్స్ ఈ లెక్కల వార్ కు తెర లేపారు. దేవర రైట్స్ 27 కోట్లుకు అమ్ముడైందని, గేమ్ ఛేంజర్ 22 కోట్లు అని ఎత్తి చూపెడుతున్నారు. 

నిన్నటి నుంచి  ‘గేమ్‌ ఛేంజర్‌’ ఓవర్ సీస్ డీల్ రీసెంట్ గా క్లోజ్ అయ్యిందని, 22 కోట్లకు ఈ డీల్ క్లోజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. Phars వారు ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే 22 కోట్లు అంటే తక్కువే అని, సౌతిండియాలో రామ్ చరణ్ వంటి స్టార్ సినిమాకు ఇది లోయిస్ట్ డీల్ అని కొందరు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు.

ఇదిలా ఉంటే ..ఈ ఓవర్ సీస్ డీల్ మ్యాటర్ లో  మరో వెర్షన్ వినిపిస్తోంది. ఇలా వినిపించడానికి కారణం ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు ఎప్పుడో 22 కోట్లకు ఫార్స్ ఫిలింస్ సంస్థకు అమ్మేసారని, . అయితే సినిమా ఆలస్యం కావడంతో ఫార్స్ సంస్థ కాస్త ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు.ఈ క్రమంలో  వడ్డీతో సహా వెనక్కు ఇచ్చి, వేరే వాళ్లకు 27 కోట్లకు అమ్మే ప్లాన్ నిర్మాత దిల్ రాజు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన అయితే ఏదీ లేదు. 

ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.  మరో ప్రక్క ఈ సినిమా ఎప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం రావటం లేదు.  ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, చిత్రీకరణ మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. 

రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   

వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios