గేమ్ ఛేంజర్ కోసం భారీ ప్లాన్ వేశాడు డైరెక్టర్ శంకర్.. అసలే ఆయన సినిమాలంటే భారీతనం భారీ బడ్జెట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే క్లైమాక్స్ నుభారీగా ప్లాన్ చేస్తున్నాడట.
సౌత్ స్టార్ డైరెక్టర్ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ స్టోరీతో.. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో రామ్ చరణ్ సరసన రెండోసారి బాలీవుడ్ బ్యూటీ కియారా ఆద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. శంకర్ ఈ సినిమాను రెండేళ్ల నుంచి తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది 2023 చివరికల్లా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక తాజాగా ఈమూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్స్ కోసం శంకర్ భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 500 మంది ఫైటర్లతో రామ్ చరణ్ పోరాట సన్నివేశాలు తీశారట. ఈ యాక్షన్ సీక్వెల్స్ తెలుగు సినిమాలో మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయన్న టాలీవుడ్ టాక్. వీటికోసం భారీగా బడ్జెట్ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే వారం మొదలవనుంది. భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ రూపుదిద్దుకుంటోంది. దిల్ రాజ్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు. అంజలి, ఎస్ జే సూర్య, సునిల్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ వరకూ ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగాయి. ప్రీప్రొడక్షన్ నడుస్తోంది. ఇక శంకర్ ఇటు గేమ్ ఛేంజర్ తో పాటు అటు ఇండియన్ 2 సినిమాను కూడా ఒకే సారి తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ 2 మూవీ కూడా దాదాపు కంప్లీట్ అయ్యింది.
