ఇక బ్రేక్ అయిపోయింది.. నాన్ స్టాప్ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ముందుగా పెండింగ్ ఉన్న గేమ్ చేంజర్ మూవీని కంప్లీట్ చేయబోతున్నాడు చరణ్. ముందుగా యాక్షన్ మూడ్ లోకి దిగబోతున్నాడట చరణ్.
దాదాపు రెండు నెలల పైనే బ్రేక్ తీసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన మెగా హీరో.. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడి చాలా కాలం అవుతుంది. రామ్ చరణ్ ఇచ్చిన బ్రేక్ వల్ల.. డైరక్టర్ శంకర్.. అక్కడ ఇండియన్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగలిగాడు. కమల్ హాసన్ హీరోగా ఇండియాన్ 2 మూవీ దాదాపు కంప్లీట్ స్టేజ్ లో ఉంది.
ఇక తాజా సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ షూటింగ్ కూడా రేపు(11 జులై) స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.పెండింగ్ షూటింగ్ ను హైదరాబాద్ లో స్టార్డ్ చేయబోతున్నారట. అంతే కాదు ఫ్రెష్ షెడ్యూల్ ను రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ లతో మొదలెట్టబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ పై కొన్ని ఫైటింగ్ సీక్వెన్స్ షూట్ చేయడానికి అన్ని సన్నాహాలు జరిగినట్టు తెలుస్తోంది. .
అంతే కాదు దిల్ రాజ్ గేమ్ చేంజర్ కోసం భారీ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్, దిల్ రాజు... కాంబోమూవీగా గేమ్ చేంజర్ పై దేశ వ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుండగా... సునిల్, నవీన్ చంద్ర, జయరాం లాంటి సీనియర్ నటులు ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నారు.
